హెరిటేజ్‌కి నారా లోకేష్ రాజీనామా
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన నారా లోకేష్ హెరిటేజ్ లో తన పదవికి రాజీనామా చేశారు. పాలు,కూరగాయల వ్యాపారంలో ఉన్న హెరిటేజ్ సంస్థకు లోకేష్ గుడ్ బై చెప్పారు. 9 ఏళ్లుగా ఆయన హెరిటేజ్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్‌ను మంత్రి వర్గంలో తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. తన భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి ఆధ్వర్యంలో హెరిటేజ్ ముందుకెళ్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.