
అజిత్‌కు ఆపరేషన్ సక్సెస్
చెన్నై : నటుడు అజిత్‌కు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అజిత్ ఆరంభం చిత్రం షూటింగ్ సమయంలో గాయాల పాలైన విషయం తెలిసిందే. ఆయన మోకాలుకు బలమైన గాయమైంది. వైద్యులు అప్పుడే శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అయితే వరుసగా చిత్రాలు అంగీకరించడంతో అజిత్ తన కాలికి తాత్కాలికి వైద్యం చేయించుకుంటూ శస్త్ర చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు.
ఇటీవల వేదాళం చిత్ర షూటింగ్ సమయంలోనూ అదే కాలికి దెబ్బ తగలగా ఆ నొప్పితోనే షూటింగ్‌ను పూర్తి చేశారు. గురువారం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అజిత్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశార్జ్ అవుతారని తెలిసింది. అజిత్ త్వరలో అమెరికా వెళ్లనున్నట్లు, అక్కడ రెండు నెలలు విశ్రాంతి తీసుకుని చెన్నైకి తిరిగి రానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.