న్యూఢిల్లీ: భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ జేమ్స్ బెవన్ శనివారం ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా బెవన్ ఢిల్లీ ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి ప్రాధాన్యతలను అడిగి తెలుసుకున్నారు. కేజ్రీవాల్ తాను రచించిన స్వరాజ్ పుస్తకాన్ని బెవన్‌కు బహూకరించారు. ఎన్నికల్లో కేజ్రీవాల్ విజయంపై అభినందనలు తెలిపిన బెవన్, ముఖ్యమంత్రిని బ్రిటన్ సందర్శించాలని ఆహ్వానించారు. ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.