న్యూఢిల్లీ: రాజధాని నగరంలో చెత్తాచెదారాన్ని వేయడానికి వీధుల్లో ఉంచిన డస్ట్‌బిన్స్ మాయమవుతున్నాయి. మూడు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన డస్టుబిన్స్‌ను దొంగలు ఎత్తుకెళుతున్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో వేసిన మూణ్నాళ్లకే కన్పించకుండా పోతున్నాయి. ఎప్పటి మాదిరిగానే నగరం అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. అయినా వాటి స్థానంలో కొత్త డస్ట్ బిన్స్‌ను ఏర్పాటు చేయడంలో మున్సిపాల్టిలు నిర్లక్ష్యవ్యవహరిస్తుండడంతో ఈ దుస్థితి నెలకొన్నది. ఈ విషయమై విశ్వాస్‌నగర్‌వాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.
తీవ్ర ఆక్షేపణ: ప్రజారోగ్యానికి ప్రమాదం పొంచి ఉన్నదని హైకోర్టు మున్సిపాలిటీలను హెచ్చరించింది. ‘నగరంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఎక్కడెక్కడ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేశారని విషయాన్ని తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ బాదర్ దుర్రేజ్ అహ్మద్, సిధార్థ మిృథుల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర, తూర్పు, దక్షిణ ఢిల్లీ మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదనేది జనవరి 21, 2015వ తేదీన నిర్వహించనున్న విచారణ నాటికి తెలియజేయాలని ఆదేశించింది.
‘ఏయే ప్రాంతాల్లో డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేశారని, నగరంలోని చెత్తను ఏయే డంపింగ్ కేంద్రాలకు తరిలిస్తున్నారనే విషయాలను తెలియజేస్తూ అఫడవిట్ దాఖలు చేయాలని, రోజూ ఎన్ని ట్రక్కుల చెత్తను డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారని, ఇందుకు రోజువారి కార్యక్రమాల నిర్వహణ తీరును తెలియజేయాలని’ ఆయా మున్సిపాలిటీలను ఆదేశించింది. ఎంసీడీస్ నిర్లక్ష్యంగా కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజాపయోగ కార్యక్రమాలను చేపట్టడంతో ఇలాంటి వైఖరి తగదని ఆదేశాల్లో పేర్కొంది. ఎంతో ఆర్భాటంగా చెత్తచెదారాన్ని తరలిస్తున్నట్టు,ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, వాస్తవంగా అమలు తీరు పరిశీలిస్తే అధ్వానంగా ఉన్నదని ఆక్షేపించింది.
చెత్తమయంగా..: అదేవిధంగా పిటిషనర్లు విశ్వాస్ నగర్‌కు చెందిన నివాసితులు శరద్ తివారి, సంజీవ్ అగ్నిహోత్రి తరఫున న్యాయవాది సుగ్రీవ్ దూబె వాదించారు. ఆయా ప్రాంతాల్లో డస్టుబిన్స్ తొలగించడం లేదా వేరేచోటికి తరలించిన కారణంగా ఎక్కడికక్కడే చెత్తకుప్పలు పేరుకొని పోయి నగరం దుర్వాసనమయంగా మారిందని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా10,000 డస్ట్‌బిన్స్‌ను ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీలు ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేశాయని, ఇక్కడ నుంచి ట్రక్కుల ద్వారా చెత్తను తీసుకొని వెళ్లి వేరేచోటికి చేరవేయడానికి కూడా ఒప్పందం చేసుకొన్నాయని అన్నారు. అయినప్పటికీ నగరం దుర్వాసనమయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేక్రమంలో డస్ట్‌బిన్స్ మాయమవుతున్నా మున్సిపల్ పాలకయంత్రాంగాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మున్సిపాలిటీలకు హైకోర్టు నోటీసులు
Published Thu, Dec 4 2014 10:19 PM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM
Advertisement
Advertisement