ఇలియానాకు సగం పెళ్ళయింది | iliana get half married | Sakshi
Sakshi News home page

ఇలియానాకు సగం పెళ్ళయింది

Published Sun, Oct 4 2015 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

ఇలియానాకు సగం పెళ్ళయింది

ఇలియానాకు సగం పెళ్ళయింది

చెన్నై : నటి ఇలియానాకు సగం పెళ్లైపోయ్యిందట. అదేమిటి సగం పెళ్లి అంటారా? ఎవరికైనా వివాహ నిశ్చితార్థం జరిగితే దాదాపు పెళ్లి అయ్యిపోయినట్లే నంటారు. ఆ విధంగా చూస్తే ఇలియానా సగం పెళ్లి జరిగి పోయిందంటున్నారు చిత్ర వర్గాలు. ఇలియానా ఈ పేరు ఇంతకు ముందు దక్షిణాదిలో మారు మోగేది.
 
ముఖ్యంగా టాలీవుడ్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్న నటి ఇలియానా. కోలీవుడ్‌లోనూ చేసింది రెండు చిత్రాలే అయినా ఇక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.తమిళంలో కేడీ చిత్రంతో పరిచయం అయిన ఇలియానా ఆ తరువాత విజయ్‌తో నన్బన్ చిత్రంలో నటించారు. ఆపై అవకాశాలు వచ్చినా అధిక పారితోషికం డిమాండ్ లాంటి ప్రచారం జరిగింది. విషయం ఏమిటంటే టాలీవుడ్‌లోనూ అమ్మడు తెరమరుగయ్యారు.
 
బాలీవుడ్ పైనే దృష్టి సారిస్తున్నారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది.అయితే ఇప్పుడు అక్కడా సినిమాలు లేవు.ఆస్ట్రేలియాకు చెందిన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో జాలీగా షికార్లు కొడుతున్నారనే రకరకాల వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలియానాకు తన ప్రేమికుడు ఆండ్రూతో ఇటీవల వివాహనిశ్చితార్థం  జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వేడుకను అత్యంత రహస్యంగా నిర్వహించినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన ఎవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలిసింది.
 
అయితే వారి వివాహ నిశ్చితార్థానికి సంబంధించి ఫొటోలు సహా ఏ ఒక్క ఆధారం బయట పడకుండా ఇలియానా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడినట్లు ప్రచారం జరుగుతోంది.మూడు నెలల తరువాత ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వివాహ తే దీని  వెల్లడించనున్నట్లు తెలిసింది. ఇంతకీ ఇలియానా వివాహ నిశ్చితార్థం జరిగిందా? అదే నిజమయితే ఆ వేడుకను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది?అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ గోవా బ్యూటీ జాకీచాన్ సరసన నటించనున్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది.ఈ రెండింటినీ కలిపి కూడితే సంగతేమిటో మీకే అర్థమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement