
విమానం టాయిలెట్లో 2.2 కిలోల బంగారం
బెంగళూరు(బనశంకరి) : దుబాయి నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచిన 2.2 కి లోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. దు బాయి నుంచి పన్ను తప్పించుకోవడానికి బంగారం తెచ్చిన ఓ ప్రయాణికుడు దానిని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మంగళూరులో జెట్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కిన ఓ వ్యక్తి బంగారాన్ని తీసుకుని ముంబాయి ఎయిర్‌పోర్టులో దిగాడు. దీనిపై సమాచారం అం దుకున్న కస్టమ్స్ అధికారులు శనివారం దుబాయి నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను క్షుణంగా తనిఖీ చేశా రు. విమానం వెనుక గల మరుగుదొడ్డిలో దాచి ఉంచిన బంగారాన్ని కనుగొన్నారు. రెండు ప్యాకెట్లలో 100 గ్రాము లు బరువుగల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.