ప్రశాంతంగా ముగిసిన ట్రేడ్ ఫెయిర్ | India International Trade Fair 2014 concludes | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ట్రేడ్ ఫెయిర్

Published Sun, Nov 30 2014 12:23 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

India International Trade Fair 2014 concludes

న్యూఢిల్లీ: నగరంలోని ప్రగతిమైదాన్‌లో ఏర్పాటు చేసిన ‘అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన’ ప్రశాంతంగా  ముగిసింది.  నవంబర్ 14-27 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ప్రధానంగా ఎలాంటి దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, పిట్‌ప్యాకెటర్ల బెడద చోటు చేసుకోలేదు. సుమారు 10,00,000 మంది వివిధరంగాలకు చెందిన సందర్శకులు ప్రగతిమైదాన్‌లోని మెట్రో స్టేషన్‌ను వినియోగించుకొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది(సీఐఎస్‌ఎఫ్) ఢిల్లీ మెట్రోలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని, దాని అధికార ప్రతినిధి హేమేం ద్ర సింగ్ తెలిపారు. ఆదివారం అత్యధికంగా 1,60,000 మంది సందర్శకులు వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన బ్యాగ్‌ను వేరేచోట ఉంచి మరిచిపోవడం మినహా భారీ సంఘటనలు ఏమీ చోటుచేసుకోలేదని తెలిపారు. ప్రయాణికులు, ఫెయిర్‌కు వచ్చే సందర్శకులకు సీఆర్‌పీఎఫ్ మెరుగైన భద్రతా సేవలు కల్పించింది. స్టేషన్‌లో సుమారు 12 చోట్ల మెటల్ డిటెక్టర్లు, 6 ఎక్సరే బ్యాగేజ్ మిషన్లు, అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement