జాలర్ల విడుదల!
Published Sat, Jan 25 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
సాక్షి, చెన్నై: శ్రీలంక చెరలో ఉన్న 71 మంది తమిళ జాలర్లు విడుదలయ్యారు. శనివారం వీరంతా కారైక్కాల్‌కు చేరుకున్నారు. అయితే, తమ వాళ్ల విడుదల కోసం రామేశ్వరం జాలర్లు నాలుగు రోజు లు సమ్మె బాట పట్టారు. శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య చర్చలు షురూ అని మత్స్యశాఖ మంత్రి జయపాల్ జలర్ల విడుదల! స్పష్టం చేశారు. రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ విరుచుకు పడటం, పట్టుకెళ్లడం పరిపాటే. కొన్నాళ్లు ఆ దేశ చెరలో బందీలుగా ఉన్న జాలర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో బయట పడుతున్నారు. అయితే, పడవలు మాత్రం ఆదేశ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల పుదుకోట్టై, నాగపట్నం జాలర్లను శ్రీలకం నావికాదళం పట్టుకెళ్లిన నేపథ్యంలో వారిని విడిపించాలన్న డిమాండ్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీలంకపై ఒత్తిడి పెంచాయి. దీంతో శ్రీలంక చెరలో ఉన్న పుదుకోట్టై, కారైక్కాల్, నాగపట్నం జాలర్లు 71 మందిని విడుదల చేశారు. వీరిని భారత సరిహద్దుల్లోకి తీసుకొచ్చి శ్రీలంక నావికాదళం విడిచి పెట్టింది. తమ బోట్లలో ఎక్కించుకున్న భారత కోస్ట్‌గార్డు దళాలు వీరందరినీ కారైక్కాల్ హార్బర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారి వారి స్వగ్రామాలకు పంపించారు. వీరికి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయపాల్ స్వాగతం పలికారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జయలలితకు జాలర్లు కతృజ్ఞతలు తెలియజేశారు.
చర్చలు షురూ: శ్రీలంక, తమిళ జాలర్లపై చర్చలు మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇంతవరకు జాలర్ల ప్రతినిధులకు చర్చలకు సంబంధించిన సమాచారం లేదు. మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో ఇంతకీ చర్చలు సాగేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై మంత్రి జయపాల్ మాట్లాడుతూ చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అరుుతే ఈనెల 27న తప్పకుండా జరుగుతాయని తేల్చక పోవడం గమనార్హం. చెన్నై పుళల్ చెరలో ఉన్న శ్రీలంక జాలర్లు 21 మంది విడుదలయ్యారు. వీరిని శ్రీలంకకు పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. వీరంతా రామేశ్వరానికి శనివారం బయలు దేరి వెళ్లారు. సమ్మె : తమ వాళ్లను విడిపించాలని డిమాండ్ చేస్తూ రామేశ్వరం జాలర్లు శనివారం నుంచి నాలుగు రోజుల సమ్మె బాట పట్టారు. రెండు రోజుల క్రితం కచ్చ దీవుల్లో చేపల వేటలో వున్న రామేశ్వరం జాలర్లను శ్రీలంక నావికాదళం బందీగా పట్టుకెళ్లింది. వీరిని విడిపించేందుకు ఎలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టకపోవడంతో జాలర్ల సంఘాల్లో ఆగ్రహం పెల్లుబికింది. చేపల వేటను బహిష్కరించి నాలుగు రోజులు సమ్మెకు సిద్ధమయ్యారు. దీంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితం అయ్యాయి.
Advertisement
Advertisement