release fishermen
-
నైజీరియాలో 19 మంది భారతీయుల విడుదల
అబుజా: ప్రైవేటు బోటులో ప్రయాణిస్తున్న భారతీయులను గత నెలలో కిడ్నాప్ చేసిన నైజీరియా సముద్ర దొంగ లు వారిని విడిచిపెట్టారు. డిసెంబర్ 15న ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట ఎమ్టీ డ్యూక్ పడవలో వెళుత ున్న 20 మందిని సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. అయితే, ప్రయాణికుల్లోఒకరు మరణించారని నైజీరియాలోని భారత కార్యాలయం ఆదివారం తెలిపింది. మిగిలిన 19 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే స్పందించిన నైజీరియా ప్రభుత్వానికి ఆ దేశంలోని భారత అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. -
చెర వీడింది..
శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదలచేస్తూ ఆ దేశ కోర్టు ఆదేశాలు జారీచేసింది. యాల్పనంలో ఉన్న 30 మందిని, తలైమన్నార్‌లోని మరో 82 మందిని బుధవారం శ్రీలంకలోని భారత దౌత్య కార్యాలయ అధికారులకు అప్పగించనున్నారు. జాలర్లను విడుదల చేసినా రాష్ట్రంలోని జాలర్ల సంఘాలు మాత్రం వెనక్కు తగ్గడంలేదు. దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట లక్ష్యంగా భారీ నిరసనకు సిద్ధమయ్యూయి. సాక్షి, చెన్నై:రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వాలు మారినా తమ తల రాతలు ఇంతేనా?... అన్నట్టుగా జాలర్ల పరిస్థితి మారింది. వరుస దాడులతో ఆగ్రహానికి లోనైన జాలర్ల సంఘాలు రామేశ్వరం, పాంబన్‌లలో సమ్మెను ఉధృతం చేశాయి. ఈ నేపథ్యం లో రాష్ట్రంలోని జాలర్లందరూ ఏకమవుతున్నారు. మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం వారి విడుదల లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచింది. రాష్ట్రంలోని కమలనాథులు సైతం ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత దౌత్యాధికారులు ఆ దేశ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. జాలర్లను విడుదల చేయాలంటూ ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే ఆదేశించారు. విడుదల: శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సే ట్విటర్ ద్వారా జాలర్ల విడుదలకు ఆదేశమిచ్చారు. దీంతో ఆ దేశ నావికాదళం అధికారులు అందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. యాల్పానం చెరలో ఉన్న 30 మందిని విడుదల చేసే విధంగా అక్కడి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వారిని విడుదల చేస్తూ కోర్టు ఆదేశించింది. అలాగే తలైమన్నార్ చెరలో ఉన్న మరో 82 మందిని విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీరందర్నీ జైలు నుంచి విడుదల చేయడానికి సాయంత్రమైంది. వీరిని బుధవారం భారత దౌత్య కార్యాలయ అధికాారులకు అప్పగించనున్నారు. అదే రోజు వీరిని భారత సరిహద్దుల్లో కోస్ట్ గార్డుకు అప్పగిస్తారు. జాలర్లు శుక్రవారం ఉదయానికి రాష్ట్రానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వెనక్కు తగ్గని సంఘాలు తమ వాళ్లను విడుదల చేసినా జాలర్ల సంఘాలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తమ జాలర్ల పడవల్ని శ్రీలంక తమ ఆధీనంలో ఉంచుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ వాళ్లతోపాటుగా పడవల్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సమ్మె ఉధృతం చేసిన జాలర్లు బుధవారం నల్ల గుడ్డను నోటికి కట్టుకుని రామేశ్వరంలో భారీ నిరసనకు పిలుపు నిచ్చారు. అలాగే అక్కడి మత్స్యశాఖ కార్యాలయం ముట్టడికి నిర్ణయించారు. ఇక జాలర్లపై దాడులు పార్లమెంట్, రాజ్యసభల్లో సైతం మర్మోగడం విశేషం. అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత తంబిదురై, రాజ్యసభ నేత మైత్రేయన్‌లు తమ ప్రసంగాల్లో శ్రీలంక చర్యల్ని తీవ్రంగా ఖండించారు. దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయించాలని కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
జాలర్ల విడుదల!
సాక్షి, చెన్నై: శ్రీలంక చెరలో ఉన్న 71 మంది తమిళ జాలర్లు విడుదలయ్యారు. శనివారం వీరంతా కారైక్కాల్‌కు చేరుకున్నారు. అయితే, తమ వాళ్ల విడుదల కోసం రామేశ్వరం జాలర్లు నాలుగు రోజు లు సమ్మె బాట పట్టారు. శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య చర్చలు షురూ అని మత్స్యశాఖ మంత్రి జయపాల్ జలర్ల విడుదల! స్పష్టం చేశారు. రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ విరుచుకు పడటం, పట్టుకెళ్లడం పరిపాటే. కొన్నాళ్లు ఆ దేశ చెరలో బందీలుగా ఉన్న జాలర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో బయట పడుతున్నారు. అయితే, పడవలు మాత్రం ఆదేశ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల పుదుకోట్టై, నాగపట్నం జాలర్లను శ్రీలకం నావికాదళం పట్టుకెళ్లిన నేపథ్యంలో వారిని విడిపించాలన్న డిమాండ్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీలంకపై ఒత్తిడి పెంచాయి. దీంతో శ్రీలంక చెరలో ఉన్న పుదుకోట్టై, కారైక్కాల్, నాగపట్నం జాలర్లు 71 మందిని విడుదల చేశారు. వీరిని భారత సరిహద్దుల్లోకి తీసుకొచ్చి శ్రీలంక నావికాదళం విడిచి పెట్టింది. తమ బోట్లలో ఎక్కించుకున్న భారత కోస్ట్‌గార్డు దళాలు వీరందరినీ కారైక్కాల్ హార్బర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారి వారి స్వగ్రామాలకు పంపించారు. వీరికి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయపాల్ స్వాగతం పలికారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జయలలితకు జాలర్లు కతృజ్ఞతలు తెలియజేశారు. చర్చలు షురూ: శ్రీలంక, తమిళ జాలర్లపై చర్చలు మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇంతవరకు జాలర్ల ప్రతినిధులకు చర్చలకు సంబంధించిన సమాచారం లేదు. మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో ఇంతకీ చర్చలు సాగేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై మంత్రి జయపాల్ మాట్లాడుతూ చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అరుుతే ఈనెల 27న తప్పకుండా జరుగుతాయని తేల్చక పోవడం గమనార్హం. చెన్నై పుళల్ చెరలో ఉన్న శ్రీలంక జాలర్లు 21 మంది విడుదలయ్యారు. వీరిని శ్రీలంకకు పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. వీరంతా రామేశ్వరానికి శనివారం బయలు దేరి వెళ్లారు. సమ్మె : తమ వాళ్లను విడిపించాలని డిమాండ్ చేస్తూ రామేశ్వరం జాలర్లు శనివారం నుంచి నాలుగు రోజుల సమ్మె బాట పట్టారు. రెండు రోజుల క్రితం కచ్చ దీవుల్లో చేపల వేటలో వున్న రామేశ్వరం జాలర్లను శ్రీలంక నావికాదళం బందీగా పట్టుకెళ్లింది. వీరిని విడిపించేందుకు ఎలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టకపోవడంతో జాలర్ల సంఘాల్లో ఆగ్రహం పెల్లుబికింది. చేపల వేటను బహిష్కరించి నాలుగు రోజులు సమ్మెకు సిద్ధమయ్యారు. దీంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితం అయ్యాయి.