ఉత్కంఠ | Jallikattu row: Police baton charge protesters | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ

Published Tue, Jan 17 2017 1:35 AM | Last Updated on Tue, Aug 21 2018 6:13 PM

Jallikattu row: Police baton charge protesters

జల్లికట్టుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో సోమవారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి వాడి వాసల్‌ నుంచి జల్లికట్టు ఎద్దును నిర్వాహకులు వదలి పెట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. బుసలు కొడుతూ పరుగులు తీస్తున్న బసవన్నను పట్టుకునేందుకు యువత దూసుకెళ్లడం, అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీలు ఝుళిపించడం వెరసి పరిస్థితి అదుపు తప్పింది. పలుచోట్ల నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టు ఎద్దుల్ని వదలడంతో వాటిని పట్టుకునేందుకు యువత ఉరకలు తీసింది.

సాక్షి, చెన్నై: తమిళుల సంప్రదాయ, సాహస క్రీడ జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతి కరువైంది. ఎన్నో పోరాటాలు సాగినా అనుమతి కలగానే మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పాలకులు విస్మరించారు. దీంతో తాడోపేడో తేల్చుకునే విధంగా నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి దూసుకెళ్లే పనిలో ని ర్వాహకులు, క్రీడాకారులు నిమగ్నం అయ్యా రు. ఆదివారం పాలమేడు రణ రంగాన్ని తలపించింది. జల్లికట్టు అంటే అలంగానల్లూరు, అ లంగానల్లూరు అంటే జల్లికట్టు అన్నట్టు ప్రపం చ ప్రసిద్ధి గాంచింది. సోమవారం ఈ ప్రాంతం ఉత్కంఠ భరిత వాతావరణంలో మునిగింది. మధురై జిల్లా అలంగానల్లూరులో నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించే రీతిలో వేలాదిగా యువత, మహి ళా లోకం, నిర్వాహకులు, క్రీడాకారులు వాడి వాసల్‌ వైపుగా ఉదయాన్నే కదిలారు.

ఉత్కంఠ భరితం: అలంగానల్లూరులోని ముని యాండి, వినాయకుడు, అలిమామలై స్వామి, ముత్తాలమ్మాన్, కాళికామ్మన్‌ ఆలయాలకు చెందిన ఐదు ఎద్దులను వాడి వాసల్‌ వద్దకు నిర్వాహకులు తీసుకొచ్చారు. పోలీసులు వాడి వాసల్‌ వైపుగా వారిని అనుమతించ లేదు. క్షణాల్లో అక్కడ వేలాదిగా జన సందోహం చేరడంతో పోలీసులకు ముచ్చెమటలు తప్పలేదు. వాడి వాసల్‌ వద్ద ఆలయాలకు చెందిన ఎద్దులకు పూజలు నిర్వహించి వెళ్లి పోతామన్నట్టుగా నిర్వాహకులు పోలీసులకు సూచించారు. ఇందుకు పోలీసులు అనుమతించ లేదు. దీంతో జన సందోహం దూసుకు రావడంతో పోలీసు లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. బలవంతంగా వాడి వాసల్‌ వద్దకు ఎద్దులతో వెళ్లిన నిర్వాహకులు అక్కడ పూజలు చేశారు. పూజల అనంతరం వాడి వాసల్‌ నుంచి ఎద్దును బయటకు వదిలి పెట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ ఎద్దును పట్టుకునేందుకు యువకులు ఉరకలు తీశారు.

దీన్ని గుర్తించిన పోలీసులు యువతను అడ్డుకునే క్రమంలో లాఠీలకు పని పెట్టారు. చివరకు పోలీసులే క్రీడాకారులుగా మారినట్టు ఉరకలు తీసి, ఆ ఎద్దును పట్టుకున్నారు. దీనిని నిరసిస్తూ వేలాదిగా జనం వాడివాసల్‌ వద్ద బైఠాయించడంతో ఉత్కంఠ తప్పలేదు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా జన సందోహం రోడ్డెక్కే యత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. వారిని కట్టడి చేయడానికి పోలీసులు లాఠీలకు పనిపెట్టారు. తోపులాట, లాఠీచార్జ్‌లో యాభైమంది గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పకుండా భారీ ఎత్తున బలగాల్ని రంగంలోకి దించడంతో అలంగానల్లూరులో ఉత్కంఠ భరిత వాతావరణం తప్పలేదు.

కరుణాస్‌ ఆగ్రహం: ఎమ్మెల్యే, సినీ నటుడు కరుణాస్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  శివగంగైలో స్వయంగా ఎద్దుతో జల్లికట్టు వాడి వాసల్‌ వైపుగా ఆయన దూసుకు రావడంతో అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత తప్పలేదు. పోలీసుల తీరు పై ఆయన తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆయ న్ను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్ర యత్నించినా, ఆయన ఎద్దు మాత్రం రంకెలేస్తూ దూసుకెళ్లడంతో వాటిని పట్టుకునేందుకు యువత ఉరకలు తీసింది. ఇదే తరహాలో అనేక ప్రాంతాల్లో నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి యువత తమ తమ ఎద్దులను మైదానాల్లోకి తీసుకెళ్లి జల్లికట్టు నిర్వహించారు. పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నా, మరికొన్ని చోట్ల చడీచప్పుడు కా కుండా సాహస క్రీడ నిరాడంబరంగా సాగింది. రాష్ట్రంలో జల్లికట్టు అన్నది జరగనే లేదని కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. వాడి వాసల్‌ నుంచి బసవన్నలు రంకెలేస్తూ దూసుకెళ్తేనే జల్లికట్టు అవుతుందే గానీ, ప్రస్తుతం నిషేదాలు ఉల్లంఘించి జల్లికట్టు జరిపినట్టుగా వస్తున్న సమాచారాలన్నీ ప్రచారాలుగా ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement