మళ్లీ వాళ్లే..
సాక్షి, చెన్నై: అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మళ్లీ పాత వాళ్లే వ్యవహరించ బోతున్నారు. స్పీకర్‌గా ధనపాల్, డిప్యూటీ స్పీకర్‌గా పొల్లాచ్చి వి.జయరామన్ మళ్లీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువే. ఆ పదవులకు జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున అభ్యర్థులుగా ఆ ఇద్దరి పేర్లను బుధవారం అమ్మ జయలలిత ప్రకటించారు. ఇక, అసెంబ్లీ నేత గా పన్నీరు సెల్వం వ్యవహరించనున్నా రు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అఖండ విజయంతో అధికార పగ్గాల్ని మళ్లీ చేపట్టిన విషయం తెలిసిందే. ఆరోసారిగా సీఎం పగ్గాలు చేపట్టిన అమ్మ జయలలిత తన కేబినెట్‌లోని మంత్రుల జాబితా ప్రకటించారు. ఎమ్మెల్యేల ప్ర మాణ స్వీకారోత్సవం ముగించారు.
ఇక, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎంపికపై దృష్టి పెట్టారు. ఈ సారి కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారేమో అన్న ఉత్కంఠ బయలు దేరింది. అయితే, కొత్త కాదు.పాతే అంటూ ఇది వరకు స్పీకర్, డిప్యూ టీ స్పీకర్‌గా వ్యవహరించిన వాళ్లకే పగ్గా లు అప్పగించేందుకు అన్నాడీఎంకే మా ర్గం సుగమం చేసింది. తిరుప్పూర్ జిల్లా అవినాశి నుంచి ఈ సారి అసెంబ్లీ మెట్లు ఎక్కిన పి. ధనపాల్, కోయంబత్తూరు జి ల్లా పొల్లాచ్చి నుంచి ఈ సారి అసెంబ్లీలో అడుగు పెట్టిన పొల్లాచ్చి వి.జయరామన్ మళ్లీ తమ బాధ్యతల్ని నిర్వర్తించేందుకు సిద్ధం అవుతున్నారు.
జూన్ మూడో తేదీన జరగనున్న అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు గాను ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థులుగా ఆ ఇద్దరి పేర్లను జయలలిత ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ అన్నది డౌటే. ఈ దృష్ట్యా ఆ రోజున ప్రొటెం స్పీకర్ సెమ్మలై ఆ ఇద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఎక్కువే. ఇక, అసెంబ్లీ నేతగా ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం మళ్లీ నియమించ బడ్డారు. అలాగే, అరియలూరు నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కిన రాజేంద్రన్‌ను ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ అమ్మ జయలలిత ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల్ని అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు.