భాస్కర్‌రావుకు హైకోర్టులో చుక్కెదురు
Published Wed, Nov 23 2016 2:39 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
= చార్జ్‌షీట్ రద్దును తిరస్కరించిన హైకోర్టు
సాక్షి, బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ లోకాయుక్త భాస్కర్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేసిన చార్జ్‌షీట్‌ను రద్దు చేయాల్సిందిగా భాస్కర్ రావ్ వేసిన అర్జీని హైకోర్టు ఏకసభ్య పీఠం తిరస్కరించింది. దీంతో భాస్కర్ రావు న్యాయపరంగా మరిన్ని చిక్కులు ఎదుర్కొనున్నారు వివరాల్లోకి వెళ్తే... భాస్కర్ రావ్ లోకాయుక్త న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు అశ్విన్ రావు రాష్ట్రంలోని వివిధ అధికారులను బెదిరించి భారీగా ముడుపులు తీసుకున్నారని, దీనికి తండ్రి భాస్కర్ రావు కూడా సహకరించాడని ప్రధాన ఆరోపణ. ఈ కేసు విచారణ చేసిన సిట్ బృందం భాస్కర్‌రావును ఏడో నిందితుడిగా చేరుస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిందిగా లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం భాస్కర్‌రావుకు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ చార్జ్‌షీట్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ భాస్కర్‌రావు హైకోర్టును ఆశ్రరుుంచారు. ఈ అర్జీపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద బైరారెడ్డి నేతృత్వంలోని ఏకసభ్య పీఠం ఈ అర్జీని తి రస్కరించింది. ఈ అర్జీపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి మంగళవా రం తన తీర్పును ప్రకటించారు. భాస్కర్ రావును విచారణ చేసేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే.
Advertisement
Advertisement