Cancellation charge
-
టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను ఏం చేస్తారంటే..
వెయిటింగ్‌లిస్ట్‌లోని రైల్ టికెట్ రద్దు చేసినప్పుడు విధించే ఛార్జీలను నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సదరు ఛార్జీలను మినహాయించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోందా? అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.సీట్ల కొరత కారణంగా రైల్వేలో వెయిటింగ్‌లిస్ట్ టికెట్లు రద్దు అవుతాయి. అయితే ఆ సమయంలో రైల్వే క్యాన్సిలేషన్ ఛార్జీలను విధిస్తుంది. వినియోగదారు ప్రమేయంలేని వాటికి ఛార్జీలు చెల్లించడం సరికాదనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి ఈమేరకు మోదీ ప్రభుత్వం ఇలాంటి ఛార్జీలను మినహాయించేలా ఏదైనా ఆలోచిస్తుందా? అని ప్రశ్నించారు. దానికి బదులుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.‘రైల్వే ప్యాసింజర్స్ (టికెట్ల రద్దు, ఛార్జీల వాపసు) రూల్స్ 2015 ప్రకారం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రద్దు చేసిన వాటితో సహా అన్ని వెయిట్లిస్టింగ్లోని టిక్కెట్ల రద్దుపై క్లర్కేజ్ ఛార్జీ విధిస్తున్నారు. ఒకవేళ సీట్ అలాట్ అవ్వకపోతే టికెట్ రద్దు అవుతుంది. ఈ ఛార్జీలతోపాటు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైల్వే నిర్వహణ ఖర్చులు, ఆస్తుల పునరుద్ధరణ, మూలధన వ్యయం, కస్టమర్ సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులుకు వినియోగిస్తున్నారు. అప్పటికే సీట్ కన్ఫర్మ్ అయినవారు ఎవరైనా తమ టికెట్ రద్దు చేసుకుంటే ఖాళీగా ఉన్న బెర్త్‌లను వెయిట్‌లిస్ట్‌లోని వారికి అలాట్ చేస్తారు. వెయిట్‌లిస్ట్‌లోని ప్రయాణీకులు ‘వికల్ప్’ స్కీమ్ ద్వారా ప్రత్యామ్నాయ రైలులో కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంది’ అని మంత్రి తెలిపారు.ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?ఏదైనా కారణాల వల్ల రైల్ బయలు దేరడానికంటే 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే కింది విధంగా ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్ క్లాస్/ ఎగ్జిక్యూటివ్ క్లాస్: రూ.240ఏసీ 2-టైర్/ ఫస్ట్ క్లాస్: రూ.200ఏసీ 3-టైర్/ ఏసీ చైర్ కార్/ఏసీ-3 ఎకానమీ: రూ.180స్లీపర్ క్లాస్: రూ.60సెకండ్ క్లాస్: రూ.20 -
విమాన ప్రయాణీకులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: తడిచి మోపెడవుతున్న కాన్సిలేషన్ చార్జీలతో ఇబ్బందులుపడుతున్న విమాన ప్రయాణికులకు విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమాన టికెట్లను బుక్ చేసుకున్న 24 గంటలలోపు కాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం వెల్లడించారు. కొత్తగా ఎయిర్ సేవా డిజి యాత్రా పథకాన్ని లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. కొన్ని సంస్కరణలపై తాజా ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో టిక్కెట్లను రద్దు చేసుకుంటే..చార్జి ఉండదు. బేస్ ఫేర్ +ఇంధన చార్జీని మించి కాన్సిలేషన్ చార్జీలు ఉండకూడదు. ప్రత్యేక అవసరాలతో ప్రయాణించేవారికోసం ప్రత్యేక సదుపాయం. విమాన ఆలస్యంలో ఎయిర్‌లైన్స్ తప్పు ఉంటే విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు గంటలకు మించి ఆలస్యమైతే పూర్తి ఫీజు వాపసు. ఆలస్యం ఒకరోజు దాటితే ప్రయాణికులకు హోటల్లో బస తదితర సౌకర్యాలు కల్పించాలి. టికెట్ బుకింగ్‌నకు ఆధార్ తప్పని కాదు. అయితే డిజీ యాత్రలో నమోదు సమయంలో మాత్రమే ఆధార్ అవసరమవుతుందనీ, డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టామని జయంత్ సిన్హా తెలిపారు. -
వారికి క్యాన్సిలేషన్ ఛార్జీలు రద్దు
న్యూఢిల్లీ : మాల్దీవుల అంతర్గత సంక్షోభం నేపథ్యంలో బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల రాజధాని మాలే నుంచి, మాలేకు ప్రయాణించే వారికి క్యాన్సిలేషన్, ఇతర ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవి 8 నుంచి 14 వరకు తమ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ''ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు మాలే నుంచి లేదా మాలేకు ప్రయాణించే ప్రయాణికులు తమ టిక్కెట్ల క్యాన్సిలేషన్‌ను చేపట్టుకోవచ్చు. మొత్తం టిక్కెట్ ఛార్జీలను రీఫండ్ చేస్తాం. క్యాన్సిలేషన్ ఛార్జీలను రద్దు చేశాం'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం మాల్దీవుల్లో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ప్రయాణం చేయడం ఇష్టం లేని ప్రయాణికులకు, మొత్తం రీఫండ్ చేస్తామని చెప్పింది. గురువారం ఎయిర్ ఇండియా కూడా ఈ ఛార్జీలను రద్దు చేసింది. మాల్దీవుల్లో ప్రస్తుతం అత్యయిక పరిస్థితి నడుస్తోంది. దీనిపై ప్రపంచ అగ్రనేతలందరూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌తోపాటు మరో ఎనిమిది మంది చట్టసభ సభ్యులను జైలు నుండి విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తుత అధ్యక్షుడు పట్టించుకోకపోవడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని దేశీయంగా ప్రజలు ఉద్యమించడం, భారత్, అమెరికా సహా పలు దేశాలు యమీన్‌పై ఒత్తిడి తేవడంతో మాల్దీవులు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. -
టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు రద్దు
ముంబై : దేశీయ క్యారియర్స్ టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను రద్దు చేశాయి. భీమా-కోరేగావ్ ఘటనపై నిరసనలు పుణే నుంచి మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో, ఎయిరిండియాతో పాటు పలు దేశీయ క్యారియర్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 2, 3 తేదీల్లో ముంబై నుంచి లేదా ముంబైకు వచ్చే ప్రయాణికులు విమాన టిక్కెట్లను రద్దు చేసుకున్నా లేదా రీషెడ్యూల్ చేసుకున్నా తాము ఎలాంటి ఛార్జీలను విధించమని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ క్యారియర్ జెట్ ఎయిర్వేస్ కూడా ఛార్జీల రద్దును నేటి వరకు అమలు చేయనున్నట్టు పేర్కొంది. బడ్జెట్ క్యారియర్ ఇండిగో ముంబై, పుణే ప్రాంతాల విమానాలకు టిక్కెట్ మార్పు లేదా క్యాన్సిలేషన్ ఫీజులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. క్యాన్సిలేషన్ ఫీజుల రద్దును ఇండిగో పొడిగిస్తున్నట్టు కూడా చెప్పింది. దళితులు చేపట్టిన భీమా-కోరేగావ్ ఆందోళనలతో ముంబైలో రైళ్లన్నీ ఆగిపోయాయి. వందకు పైగా బస్సులు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు ముంబైలోని పలు ప్రాంతాల్లో వాణిజ్య, విద్యాసంస్థలు, దుకాణాలను మూసివేయించారు. పుణే దగ్గర్లోని భీమా-కోరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భరంగా హిందూ, దళిత సంస్థల కార్యకర్తల వద్ద ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలకు వ్యతిరేకంగా భరిజా బహుజన్ మహాసంఘ్ లీడరు ప్రకాశ్ అంబేద్కర్ మహారాష్ట్ర బంద్‌ను చేపడుతున్నారు. -
విమాన ప్రయాణీకులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విమాన ప్రయాణీకులకు ఇది నిజంగా శుభవార్తే. భారీగా బాదేస్తున్న విమాన టికెట్ల కాన్సిలేషన్ చార్జీలపై విమానయాన మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రయాణీకులకు భారీ ఊరట కల్పించనుంది. దేశీయ విమానయాన సంస్థల్లో టికెట్ల రద్దు సమయంలో విధించే చార్జీల సవరణకు కసరత్తు చేస్తోంది. దీనికి బదులు సరికొత్త నిబంధనలను అమలు చేయనుంది. దేశీయ విమానయాన సంస్థలు కాన్సిలేషన్ ఫీజు రూ. 3వేల చొప్పున వసూలు చేస్తున్న నేపథ్యంలో కాన్సిలేషన్ చార్జీల డేటా పంపించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కోరింది. తాజా నివేదికల ప్రకారం, రద్దు ఛార్జీలు బేస్ ఫేర్ కన్నా లేదా ఇంధన సర్ ఛార్జ్ మొత్తం కంటే ఎక్కువగా ఉండరాదు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునేలా నియమాలను రూపొందించనున్నట్టు సమాచారం. ఇటీవల కాన్సిలేషన్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో డీజీసీఏ ఈ చర్యలకు దిగనుంది. కాగ ఉడాన్(తక్కువ ధరల్లో విమాన ప్రయాణ) పథకం గంటకు రూ. 2500 విమాన టికెట్లను అందిస్తోంటే.. దానికంటే కాన్సిలేషన్ చార్జీలు అధికంగా ఉండడంపై ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈ రద్దు ఛార్జీలను తిరిగి నియంత్రించాల్సినవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీటిని సమీక్షించాలని జయంత్ సిన్హా ఆదేశించారు. -
విమాన ప్రయాణికులకు త్వరలో గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు త్వరలోనే విమానయాన సంస్థలు గుడ్‌న్యూస్ చెప్పనున్నాయి. ప్రయాణికులపై ఇప్పటి వరకు విధిస్తున్న అత్యధిక రద్దు ఛార్జీలు ఇక నుంచి తగ్గబోతున్నాయి. ప్రస్తుతం కొన్ని విమానయాన సంస్థలు దేశీయ టిక్కెట్ల రద్దుపై రూ.3000 వరకు ఛార్జీలు విధిస్తున్నాయి. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. అత్యధిక మొత్తంలో విధిస్తున్న ఛార్జీలపై తగ్గాలంటూ విమానయాన సంస్థలను కేంద్రం కోరబోతుంది. సహేతుకమైన మొత్తానికి ఈ ఫీజుల తగ్గింపు ఉండేలా ప్రభుత్వం ఎయిర్‌లైన్స్‌తో చర్చలు జరుపబోతున్నట్టు సమాచారం. ''రద్దు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. రూ.3000 ఛార్జీ చాలా కేసుల్లో టిక్కెట్ కన్నా ఎక్కువగా ఉంది. తమ ఉడాన్ స్కీమ్ కిందనే గంట ప్రయాణానికి రూ.2500 ఛార్జీ ఉంది'' అని ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఎక్కువ మొత్తంలో రద్దు ఛార్జీల వల్ల ముందస్తుగా తక్కువ ధరకు టిక్కెట్లు కొనడాన్ని నిరోధిస్తుందని ట్రావెల్ నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరకు ముందస్తుగా టిక్కెట్ కొనుగోలు చేసిన తర్వాత అనుకోని కారణాల వల్ల టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే, రద్దు ఛార్జీలు అత్యధిక మొత్తంలో ఉంటున్నట్టు తేలింది. దీంతో కొనుగోలుదారులు ముందస్తుగా టిక్కెట్లు కొనుగోలు చేయడాన్ని వాయిదా వేస్తున్నారని ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. ఒక్క రద్దు ఛార్జీలను మాత్రమే కాక, చెక్-ఇన్-బ్యాగేజీ వంటి పలు ఛార్జీలను కూడా విమానయాన సంస్థలు పెంచుతున్నాయి. -
దినకరన్ చార్జ్‌షీట్ రద్దు
హైకోర్టు ఉత్తర్వులు టీ.నగర్: విదేశీ మారకద్రవ్యం కేసులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌పై ఏప్రిల్ 19వ తేదీ వరకు దాఖలైన చార్జ్‌షీటును రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అందులో పిటిషనర్ తరఫు న్యాయవాది పాల్గొనే విధంగా జూలై 31వ తేదీలోగా ఒకే రోజున కొత్త చార్జ్‌షీటును నమోదు చేయాలని, మూడు నెలల్లోగా విచారణను ఎగ్మూరు ఆర్థిక నేరాల విభాగం కోర్టు ముగించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. గత 1996–97లో జేజే టీవీకి విదేశాల నుంచి ప్రసార పరికరాలను కొనుగోలు చేయడానికి సంబంధించి విదేశీ మారకద్రవ్యం మోసానికి పాల్పడినట్లు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె అక్క కుమారుడు భాస్కరన్, జేజే టీవీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తమను విడిపించాలని కోరుతూ శశికళ, టీటీవీ దినకరన్ ఇదివరకే ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఎగ్మూరు కోర్టు గత 2015లో శశికళపైన ఒక కేసులోను, దినకరన్‌పై రెండు కేసుల్లోను, భాస్కరన్‌పై ఒక కేసులోను వారిని విడిపిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎగ్మూరు కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈడీ హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విదేశీ మారకద్రవ్యం కేసు నుంచి శశికళ, దినకరన్ విడిపించడాన్ని రద్దుచేస్తూ ఎగ్మూరు కోర్టు కేసు విచారణను కొనసాగించాల్సిందిగా ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం టీటీవీ దినకరన్పైన రెండు కేసుల విచారణను ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి సమక్షంలో జరుగుతూ వచ్చింది. ఇలాఉండగా కొడనాడు ఎస్టేట్ బంగళాను నకిలీ సంస్థల ద్వారా కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు దాఖలైన కేసులో దినకరన్‌పై ఎగ్మూరు కోర్టు చార్జ్‌షీటు నమోదు చేసింది. కేసుకు సంబంధించి టీటీవీ దినకరన్ కోర్టులో హాజరయ్యారు. తాను ఏ పొరపాటు చేయలేదని తన తరఫు వివరణ ఇచ్చారు. ఈ కేసులో దినకరన్‌పై చార్జ్షీట్లు నమోదు చేయడంతో కేసులో తదుపరి విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఇలాండగా మద్రాసు హైకోర్టులో టీటీవీ దినకరన్ కొత్తగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో తనపై చార్జ్‌షీటు నమోదు చేసే సమయంలో తన తరఫు వాదనలు వినకుండా చార్జ్‌షీటు నమోదు చేశారని, అందువల్ల చార్జిషీటు నమోదుకు, ఎగ్మూరు కోర్టు విచారణకు స్టే విధించాలని టీటీవీ దినకరన్ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ 10 రోజుల క్రితం న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. ఆ సమయంలో దినకరన్‌పై చార్జ్‌షీటు నమోదుకు మధ్యంతర స్టే విధిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ విదేశీ మారకద్రవ్యం కేసులో దినకరన్‌పై ఏప్రిల్ 19 వరకు నమోదైన చార్జ్‌షీటు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా పిటిషనర్ తరఫు న్యాయవాది పాల్గొనే విధంగా జూలై 31వ తేదీలోగా ఒకే రోజున కొత్త చార్జ్‌షీటును నమోదు చేయాలని, ఇదివరకే కాలాతీతమైన కేసును మరింతగా పొడిగించకూడదని తెలిపారు. అంతేకాకుండా కేసుపై ప్రతిరోజూ విచారణ జరిపి మూడు నెలల్లోగా విచారణను ఎగ్మూరు ఆర్థికనేరాల విభాగం కోర్టు ముగిం చాలని ఉత్తర్వులిచ్చారు. -
భాస్కర్‌రావుకు హైకోర్టులో చుక్కెదురు
= చార్జ్‌షీట్ రద్దును తిరస్కరించిన హైకోర్టు సాక్షి, బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ లోకాయుక్త భాస్కర్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేసిన చార్జ్‌షీట్‌ను రద్దు చేయాల్సిందిగా భాస్కర్ రావ్ వేసిన అర్జీని హైకోర్టు ఏకసభ్య పీఠం తిరస్కరించింది. దీంతో భాస్కర్ రావు న్యాయపరంగా మరిన్ని చిక్కులు ఎదుర్కొనున్నారు వివరాల్లోకి వెళ్తే... భాస్కర్ రావ్ లోకాయుక్త న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు అశ్విన్ రావు రాష్ట్రంలోని వివిధ అధికారులను బెదిరించి భారీగా ముడుపులు తీసుకున్నారని, దీనికి తండ్రి భాస్కర్ రావు కూడా సహకరించాడని ప్రధాన ఆరోపణ. ఈ కేసు విచారణ చేసిన సిట్ బృందం భాస్కర్‌రావును ఏడో నిందితుడిగా చేరుస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిందిగా లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం భాస్కర్‌రావుకు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ చార్జ్‌షీట్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ భాస్కర్‌రావు హైకోర్టును ఆశ్రరుుంచారు. ఈ అర్జీపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద బైరారెడ్డి నేతృత్వంలోని ఏకసభ్య పీఠం ఈ అర్జీని తి రస్కరించింది. ఈ అర్జీపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి మంగళవా రం తన తీర్పును ప్రకటించారు. భాస్కర్ రావును విచారణ చేసేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే.