ముంబై : దేశీయ క్యారియర్స్ టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను రద్దు చేశాయి. భీమా-కోరేగావ్ ఘటనపై నిరసనలు పుణే నుంచి మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో, ఎయిరిండియాతో పాటు పలు దేశీయ క్యారియర్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 2, 3 తేదీల్లో ముంబై నుంచి లేదా ముంబైకు వచ్చే ప్రయాణికులు విమాన టిక్కెట్లను రద్దు చేసుకున్నా లేదా రీషెడ్యూల్ చేసుకున్నా తాము ఎలాంటి ఛార్జీలను విధించమని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రైవేట్ క్యారియర్ జెట్ ఎయిర్‌వేస్ కూడా ఛార్జీల రద్దును నేటి వరకు అమలు చేయనున్నట్టు పేర్కొంది. బడ్జెట్ క్యారియర్ ఇండిగో ముంబై, పుణే ప్రాంతాల విమానాలకు టిక్కెట్ మార్పు లేదా క్యాన్సిలేషన్ ఫీజులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. క్యాన్సిలేషన్ ఫీజుల రద్దును ఇండిగో పొడిగిస్తున్నట్టు కూడా చెప్పింది. దళితులు చేపట్టిన భీమా-కోరేగావ్ ఆందోళనలతో ముంబైలో రైళ్లన్నీ ఆగిపోయాయి. వందకు పైగా బస్సులు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు ముంబైలోని పలు ప్రాంతాల్లో వాణిజ్య, విద్యాసంస్థలు, దుకాణాలను మూసివేయించారు. పుణే దగ్గర్లోని భీమా-కోరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భరంగా హిందూ, దళిత సంస్థల కార్యకర్తల వద్ద ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలకు వ్యతిరేకంగా భరిజా బహుజన్ మహాసంఘ్ లీడరు ప్రకాశ్ అంబేద్కర్ మహారాష్ట్ర బంద్‌ను చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment