ఆఫ్రికన్ దేశాల్లో రాజకీయ అస్థిరత కారణంగా వలసలు
రాష్ట్రంలో 30 వేలకు పైగా జనాభా
విద్యాభ్యాసం కోసం బెంగళూరుకు వస్తున్న వైనం
సంపాదన కోసం అక్రమ మార్గాలు
మాదక ద్రవ్యాలు, ఆన్‌లైన్ మోసాల్లో నిష్ణాతులు !
బెంగళూరు: వీసా గడువు తీరిన వారికి కర్ణాటక స్వర్గధామంలా మారుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు బెంగళూరు, మంగళూరు తదితర నగరాల్లో ఉన్న పరిస్థితులు ఇందుకు కారణంగా పరిణమిస్తున్నాయి. దేశ ఐటీ రాజధానిగా పేరు గడించిన బెంగళూరుకు వివిధ దేశాలతో పాటు ఆఫ్రికన్ దేశాలకు చెందిన ప్రజలు ఉపాధి కోసం బెంగళూరు బాట పడుతున్నారు. ఇలా వచ్చే వారు తక్కువ ఖర్చు, నిఘా ఉండదన్న కారణంతో టూరిస్ట్ వీసాపై బెంగళూరుకు వస్తూ గడువు తీరిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సంస్థ ద్వారా ప్రతి ఏడాది దాదాపు 200 మందికి పైగా ఆఫ్రికన్ విద్యార్థులు కర్ణాటకకు వ స్తున్నారు. ఐసీసీఆర్-కర్ణాటక రీజినల్ కార్యాలయంలోని గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద 245 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఒక్క బెంగళూరులోనే 133 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలు అందిస్తున్న స్కాలర్‌షిప్పుల ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ప్రతి ఏడాది మూడు వేల మందికి పైగా విద్యార్థులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు వస్తున్నారు. ఇలా విద్యాసంబంధ కారణాలు చూపుతూ వస్తున్న వారిలో ఎక్కువమంది బెంగళూరు, మైసూరు, మంగళూరులోని ఉంటున్నారని పోలీసు శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా టూరిస్ట్ వీసాపై వచ్చి ఏళ్లు గడిచినా వారి దేశాలకు వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నవారు రాాష్ట్రంలో 30 వేల మందికి పైగా ఉన్నారని పోలీసుశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
15 వేల మందిపై కేసులు...
ఆఫ్రికన్ దేశాల్లో రాజకీయ అస్థిరత్వం సర్వసాధారణం. దీని వల్ల శాంతి భద్రతల సమస్య ఎక్కువగా ఉండటంతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. దీంతో చదువు కోసం వచ్చిన ఆఫ్రికన్ విద్యార్థులకు కర్ణాటకలోని రాజకీయ, సామాజిక పరిస్థితులు, ఆహ్లాద వాతావరణం వారిని ఇక్కడకు రప్పిస్తోంది. ఇక్కడే వివిధ రంగాల్లోని ఉద్యోగ, ఉపాధిని వెతుక్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో తలెత్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కొంతమంది అక్రమ దారులు వెతుక్కుంటున్నారు. బెంగళూరు, మంగళూరు వంటి నగరాలకు డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్ మోసాలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఈ ఆక్రమ మార్గంలో వీరు మధ్యవర్తులుగా మాత్రమే ఉంటున్నారని ఆఫ్రికన్ దేశాల్లోనే ఉన్న కొంతమంది ‘డాన్’లు కర్ణాటకలోని ఉద్యోగ, ఉపాధి వేటలో ఉన్న ఆఫ్రికన్ విద్యార్థులను వినియోగించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కారణం ఏమైనా ఇలా వివిధ రకాల ఘటనలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వ రకూ 15 వేల మంది ఆఫ్రికన్ విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం 85 మందికి మాత్రం శిక్ష ఖరారు కాగా మిగిలిన వారిలో చాలా మంది బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇలా బెయిల్ పై వచ్చిన వారు తమ మకాంతో పాటు పేరును కూడా మార్చి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. మరోవైపు డ్రగ్స్ అక్రమ రవాణాలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇలా డగ్స్‌ను రవాణా చేస్తూ రెండేళ్లలో రాష్ట్రంలో 28 మంది ఆఫ్రికన్ దేశాలకు చెందిన అమ్మాయిలు రాష్ట్ర పోలీసులకు, రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల్లోని తనిఖీ బృందానికి చిక్కారు. వీరిలో నైజీరియా, టాంజానియా దేశాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నట్లు పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో 30 వేల మంది : హోం మంత్రి
రాష్ట్రంలో వివిధ చోట్ల ఆఫ్రికన్ దేశాలకు చెందిన 30 వేల మంది ప్రజలు అక్రమంగా నివశిస్తున్నారన్న సమాచారం ఉంది. అయితే ఎవరు, ఎక్కడ ఉన్నారన్న విషయం పై ఇప్పటి వరకూ సమాచారం లేదు. ఈ విషయంపై పోలీసుకుల ఇప్పటికే దిశానిర్దేశం చేశాను.
మద్యంలో మత్తులో ఆఫ్రిక్ విద్యార్థి వీరంగం
బెంగళూరు (బనశంకరి) : పీకల మద్యం తాగిన ఓ ఆఫ్రికన్ విద్యార్థి స్థానికులపై దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు...హెణ్ణూరు రోడ్డు బైరతిబండె వద్ద రాత్రి మద్యం మత్తులో ఉన్న ఆఫ్రికన్ విద్యార్థి బైక్‌తో పాదచారులను ఢీకొని గొడవకు దిగాడు. అనంతరం బైరతిబండె వద్ద ఉన్న ఎలక్ట్రిక్ దుకాణం ముందుకు వచ్చిన స్థానికులతో ఘర్షణ పడ్డాడు. షర్టును తొలగించి వీరంగం సృష్టించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దృశ్యాన్ని మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా అతనిపై కూడా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇదే సమయంలో స్థానికులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ఆఫ్రికన్ విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి పోలీసులు స్థానికులను అరెస్ట్ చేయడంతో ఆదివారం సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్థానికులు జంకుతున్నారు.
వీసా గడువు తీరిన వారికి స్వర్గధామం కర్ణాటక
Published Tue, Feb 9 2016 2:10 AM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM
Advertisement
Advertisement