ఆ బంగారం జోలికొస్తే ఊరుకోను: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దుపై ప్రకటన చేశారు. నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను తొలగించి.. క్యాష్ లెస్ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను త్వరలో టీఎస్ వ్యాలెట్‌ను తీసుకొస్తామని కేసీఆర్ తెలిపారు. తొందరలోనే సిద్దిపేట జిల్లా క్యాష్‌లెస్‌గా మారుతుందని కేసీఆర్ వెల్లడించారు.
నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనదని కేసీఆర్ అభివర్ణించారు. మహిళల ఆభరణాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. లెక్కల్లో లేని నల్ల బంగారం ఉన్న వారిపై మాత్రమే చర్యలుంటాయన్నారు. వారసత్వంగా వచ్చిన నగలకు సైతం ఇబ్బందేం లేదని తెలిపారు. ఒకవేళ వారసత్వ నగలను కేంద్రం తీసుకుంటే ముందుగా నేనే వ్యతిరేకిస్తా అని కేసీఆర్ అన్నారు.