సాక్షి, చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులతో కలిసి పల్లిపట్టులో కేక్ కట్ చేశారు. అంతేకాక సీఎం కేసీఆర్ పేరు మీద తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతో పూజలు చేసి, భక్తులకు ప్రసాదాలు పంచారు.
కేతిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమ నేత కేసీఆర్ తెలుగు వాడి సత్తాను ఢిల్లీకి తెలిపారు. ‘కేంద్రం దిగివచ్చే వరకు తన పోరాటం సాగించారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల అయినా ప్రత్యేక రాష్ట్రంను సాధించారు. తమిళనాడులో నివశించే తెలుగు వారు తెలంగాణ వీరుడు కేసీఆర్ పుట్టినరోజును జరపడం ఒక బాధ్యత. ఎందుకంటే ఆయనలో ఉద్యమస్పూర్తి, తమిళనాడులో తెలుగును సాధించుటకు నిరంతరం పోరాటం చేస్తున్న మనకు ఆదర్శం. అన్న నందమూరి తారక రామారావు తర్వాత ఇటీవల హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను కేసీఆర్ నిర్వహించారు. తెలుగు వారు ఏ రాష్ట్రంలో ఉన్నా మనమంతా ఒక్కటే అనే భావన ప్రజల్లోకి తీసుకపోవాలని ’ కేతిరెడ్డి పిలుపునిచ్చారు.
మారుమూల గ్రామమైనా పల్లిపట్టులో కేసీఆర్ పుట్టిన రోజు జరపడం చాలా సంతోషంగా ఉందని కేతిరెడ్డి అన్నారు. అంతేకాక ఆయన పట్ల తెలుగు వారి ప్రేమే ఇందుకు కారణమని కేతిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment