డిచ్‌పల్లిలో లారీ బోల్తా: భారీగా ట్రాఫిక్ జాం
Published Fri, Sep 30 2016 11:06 AM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM
డిచ్‌పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రడిని ఆస్పత్రికి తరలించి రోడ్డుకు అడ్డంగా పడిన లారీని క్రేన్ సాయంతో తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.
Advertisement
Advertisement