
సాక్షి, బళ్లారి: జీవితాంతం కలిసి జీవించాలని పరస్పరం ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ ఫలించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా మాకనడుకు గ్రామానికి చెందిన రేణుక(21), సండూరు తాలూకా మలెతుంబరగుద్ది గ్రామానికి చెందిన హులుగేష్(23)లు ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించిన తరుణంలో యువతికి కుటుంబ సభ్యులు వేరొకరితో పెళ్లి నిశ్చితార్థం చేశారు. దీంతో మనస్థాపం చెందిన ఇద్దరు ప్రేమికులు చిక్కజోగిహళ్లిలోని చర్చి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయటంతో వెంటనే దావణగెరె జిల్లా జగళూరు ఆస్పత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. గత కొన్నేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో పాటు బంధువులు కూడా కావడం గమనార్హం. ప్రేమించుకున్న విషయం ఇంట్లో తెలపకపోవడం వల్ల అమ్మాయి తల్లిదండ్రులు వేరొకరితో వివాహ నిశ్చితార్థంచేసినట్లు బంధువులు పేర్కొన్నారు. ఈఘటనపై కూడ్లిగి తాలూకా కానాహొసళ్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment