lover commits suicide
-
ప్రియురాలి కండిషన్.. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..
సాక్షి, కామారెడ్డి క్రైం: ప్రేమించిన అమ్మాయి దక్కదేమోననే బెంగతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. పట్టణంలని స్నేహపూరి కాలనీలో నివాసం ఉండే పోలబోయిన లలితకు అఖిల్ (20), నిఖిల్ అనే కవల పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దవాడైన అఖిల్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. ఇటీవలే ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. చాలా రోజులుగా విద్యానగర్ కాలనీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని అమ్మాయి చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్థాపం చెందాడు. అనారోగ్య కారణాలతో తల్లి బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఉదయంఇంటికి వచ్చి చూడగా బెడ్రూంలో ఫ్యాన్‌కు అఖిల్ చున్నీతో ఉరివేసుకుని ఉన్నాడు. మృతుడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఫెయిల్ అయ్యానని యువతి ఆత్మహత్య కామారెడ్డి క్రైం: పరీక్షలో ఫెయిల్ కావడంతో నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష (19) నిజామాబాద్ జిల్లా ధర్మారంలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో ఇటీవల జీఎన్ఎం పూర్తి చేసింది. పరీక్షా ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులు తప్పాయని ఆమెకు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చిన్న పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
ఏడాది నుంచి లవ్: ప్రియురాలు దక్కడం లేదని..
సాక్షి, మహబూబ్‌నగర్ : ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని లింగమయ్యకాలనీకి చెందిన కాట్రాజు పవన్‌కుమార్ (23), ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు సోమవారం రాత్రి ఇంటి వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఇది గమనించిన బంధువులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అదే అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, పవన్‌కుమార్ తల్లిదండ్రులు సుమారు 12ఏళ్ల క్రితమే మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడగా, ప్రస్తుతం సోదరి మాత్రమే ఉంది. ఈ విషయమై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహంతో రాస్తారోకో యువకుడి మృతికి ప్రేమించిన యువతి తల్లిదండ్రులే కారణమంటూ అంబేద్కర్కూడలిలో పవన్‌కుమార్ మృతదేహంతో బంధువులు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. బాధ్యులను శిక్షించి, బాధిత కుటుంబ సభ్యులకు తగు న్యాయం చేయాలన్నారు. సీఐ బీషన్న చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
ప్రేయసిని కాల్చిన చంపిన ప్రియుడు
ఫేస్బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. నీవులేక నేను లేను అనేలా ప్రేమ సామ్రాజ్యంలో విహరించారు. పెళ్లికి దారితీసే క్రమంలో ప్రేమ వికటించింది. మనస్పర్థలకు దారితీసింది. ఈలోకంలో నీవు ఉండకూడదని ప్రియురాలిని తుపాకీతో కాల్చేశాడు. నీవు లేనపుడు నేను మాత్రం ఎందుకు అని తాను కాల్చుకున్నాడు. ప్రేమికులిద్దరి నాలుగేళ్ల ప్రేమకు నూరేళ్లు నిండిపోయాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అర్ధరాత్రి ప్రియురాలి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న యువకుడు కొన్ని గంటల్లోనే ప్రియురాలిని హతమార్చి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించుకున్న వారికి పెళ్లి చేసేందుకు అంగీకరించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. విల్లుపురం జిల్లా అన్నియూర్ కరుణానిధి నగర్‌కు చెందిన శేఖర్, మారియమ్మాళ్ దంపతులు తమ కుమార్తె సరస్వతి (23)ని వైద్యురాలిని చేయాలని కలలు కనేవారు. సరస్వతి సైతం పట్టుదలగా చదివేది. డిగ్రీ పాసైన తరువాత నర్సింగ్ కోర్సు చేస్తున్న సమయంలో వైద్య సీటు వచ్చింది. దీంతో నర్సింగ్ చదువును మధ్యలోనే ఆపివేసి చెన్నైలోని ఒక ప్రయివేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేరింది. ప్రస్తుతం ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. ఇదిలా ఉండగా, ఈరోడ్ జిల్లా సిద్దగౌండంపాళెంకు చెందిన కార్తివేల్ (27)తో ఆమెకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాటింగ్‌లు చేసుకునేవారు. కార్తిక్‌వేల్ తమిళనాడు పోలీస్‌శాఖలో కమాండో పోలీస్‌గా పనిచేస్తున్నాడు. చెన్నైలో ఉంటూ వీవీఐపీలకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రేమికులిద్దరూ చెన్నైలో ఉండడంతో ప్రేమ చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య అడపాదడపా గొడవలు రేగేవి. మాట్లాడకోకుండా ఉంటూ మరలా కలుసుకునే వారు. ఇదే సమయంలో సర్వస్వతి తన తోటి వైద్య విద్యార్థితో స్నేహం చేయడాన్ని కార్తిక్‌వేల్ తట్టుకోలేక తగవు పెట్టుకున్నాడు. మరలా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం తన జన్మదినం కావడంతో సరస్వతి అన్నియూర్‌లోని తన ఇంటికి వచ్చింది. కార్తిక్‌వేల్ కూడా కేక్‌తో సరస్వతి ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరి ప్రేమ వ్యవహారం సరస్వతి తల్లిదండ్రులకు తెలియడంతో సాధారణంగా తీసుకున్నారు. ప్రియుడు తెచ్చిన కేక్‌ను అర్ధరాత్రి 12 గంటలు దాటగానే బంధుమిత్రుల సమక్షంలో సరస్వతి కట్ చేయగా కోలాహలంగా జన్మదిన వేడుకలు ముగిశాయి. ఆహ్వానితులంతా వెళ్లిపోగా సరస్వతి తల్లిదండ్రులు హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రేమికులిద్దరూ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టుకోకుండా కబుర్లలోకి దిగారు. బుధవారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో వరుసగా రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం రావడంతో సరస్వతి తల్లిదండ్రులు గదిలోకి వెళ్లిచూడగా సరస్వతి, కార్తివేల్ చెరోవైపున ప్రాణాలు కోల్పోయిన స్థితిలో రక్తపు మడుగులో పడిఉన్నారు. పోలీసులు వచ్చి శవాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. వారిపక్కనే పడివున్న కార్తివేల్ సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమాన భూతం పోలీసుల కథనం ప్రకారం, ప్రేమికుల ఇరువురూ తరచూ తగవులాడుకుని విడిపోవడం, మరలా కలుసుకునే వారు. వైద్యకళాశాలలో తోటి విద్యార్థితో సరస్వతి చనువుగా ఉన్నట్లు కార్తిక్‌వేల్‌కు అనుమానం ఏర్పడింది. ఈ విషయమై కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ప్రియురాలి ఎక్కడ మారిపోతుందోనని గాబరాపడిన కార్తిక్‌వేల్ వెంటనే పెళ్లి చేసుకుందామని పట్టుబట్టడంతో సరస్వతి నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన అతడు తన సర్వీస్ రివాల్వర్‌తో ప్రియురాలి గుండెపై రెండుసార్లు తుపాకీతో కాల్చాడు. వెంటనే తన తలకు అదే రివాల్వర్‌ను గురిపెట్టుకుని పేల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరైన తండ్రి ఎంతో గారాబంగా పెంచుకున్న కుమార్తెను కోల్పోయానని సరస్వతి శవంపై పడి తండ్రి శేఖర్ గుండలవిసేలా కన్నీరుకార్చాడు. ‘‘సాధారణ రైతుగా బతుకీడుస్తున్న నాకు తగిన ఆర్థిక స్థోమతలేకున్నా ఏకైక కుమార్తెను ఎంబీబీఎస్‌లో చేర్చాను, వైద్యురాలు అవుతుంది, గ్రామాల్లో సేవలందిస్తుందని కలలు కన్నాను, జన్మదినం రోజునే నా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు’’ అని రోదించాడు. -
ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: జీవితాంతం కలిసి జీవించాలని పరస్పరం ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ ఫలించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా మాకనడుకు గ్రామానికి చెందిన రేణుక(21), సండూరు తాలూకా మలెతుంబరగుద్ది గ్రామానికి చెందిన హులుగేష్(23)లు ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించిన తరుణంలో యువతికి కుటుంబ సభ్యులు వేరొకరితో పెళ్లి నిశ్చితార్థం చేశారు. దీంతో మనస్థాపం చెందిన ఇద్దరు ప్రేమికులు చిక్కజోగిహళ్లిలోని చర్చి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయటంతో వెంటనే దావణగెరె జిల్లా జగళూరు ఆస్పత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. గత కొన్నేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో పాటు బంధువులు కూడా కావడం గమనార్హం. ప్రేమించుకున్న విషయం ఇంట్లో తెలపకపోవడం వల్ల అమ్మాయి తల్లిదండ్రులు వేరొకరితో వివాహ నిశ్చితార్థంచేసినట్లు బంధువులు పేర్కొన్నారు. ఈఘటనపై కూడ్లిగి తాలూకా కానాహొసళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
ప్రాణం తీసిన ప్రేమ
మంథని: పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్(26) శుక్రవారం రాత్రి కరీంనగర్‌లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. యువకుడి ఇంటిముందు బైఠాయించిన యువతి, ఆమె కుటుంబసభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు.. మైదుపల్లి చెందిన పెట్టెం రజనీకాంత్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బుధవారం నుంచి రజనీకాంత్ ఇంటిముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మనస్తాపం చెందిన రజనీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. మంథని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న యువతి సింధుతోపాటు ఆమె అన్న తిరుపతి, తల్లి ఓదమ్మ, అత్త భాగ్య యువకుడి ఇంటిముందు ఉన్నారు. మరణవార్త తెలియగానే కోపోద్రిక్తులైన యువకుడి బంధువులు వారిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారని, తన మెడను కాళ్లతో తొక్కారని సింధు తెలిపింది. సింధు అన్న తిరుపతి తల, చేతులు, ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. సింధు, ఆమె తల్లికి సైతం గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంథని ఎస్ఐ ఉపేందర్ గ్రామానికి వెళ్లి గాయపడ్డవారిని తమ వాహనంలో మంథని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రేమికుడి ఆత్మహత్య
టీనగర్: ప్రియురాలిని తన నుంచి దూరం చేసారని మనస్తాపానికి గురైన ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన నీలగిరి జిల్లా కొత్తగిరిలో సమీపంలో చోటుచేసుకుంది. నీలగిరి జిల్లా కొత్తగిరి సమీపంలోని కడసోలై గ్రామానికి చెందిన నందకుమార్ (24) , సోలూర్‌మట్టం ప్రాంతానికి చెందిన కరిష్మా (20) మూడు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మదురై కి పారిపోయారు. కాగా ఈ విషయమై కరిష్మా తల్లిదండ్రులు తమ కుమార్తెను నందకుమార్ కిడ్నాప్ చేసినట్లు సోలూర్‌మట్టం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మదురైలో ఉన్న కరిష్మాను తీసుకొచ్చి పాలక్కాడులోని బంధువల ఇంట్లో ఉంచారు. దీంతో మనోవేదనకు గురైన నందకుమార్ గురువారం మేట్టుపాళయంలో విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మేట్టుపాళయం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించిన బంధువులు, ప్రజలు అక్కడ రాస్తారోకో జరపడంతో ఉద్రిక్తత ఏర్పడింది. -
ప్రియుడి ఆత్మహత్య - రైలు ఎదుట దూకేసిన ప్రియురాలు
తన ప్రియుడు హౌరా బ్రిడ్జి మీద నుంచి దూకేసినట్లు తెలియడంతో ఆ ప్రియురాలి హృదయం గాయపడింది. అతడులేని జీవితం తనకెందుకని అనుకుంది. అంతే.. మెట్రో రైల్వే స్టేషన్‌కు చేరుకుని, వేగంగా వస్తున్న రైలు ఎదుటకు దూకేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని కాళీఘాట్ మెట్రో రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను కాళీఘాట్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ప్రియుడు బికాష్ సాహుకు, ఆమెకు ఫోన్లో గొడవ కావడంతో అతడు హౌరా బ్రిడ్జి మీద నుంచి హుగ్లీ నదిలోకి దూకేశాడు. ఆ విషయం తెలియడంతో ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాలీగంజ్‌లో నివసించే ఆమె.. కాలేజిలో చదువుతోంది.