ప్రియుడి ఆత్మహత్య - రైలు ఎదుట దూకేసిన ప్రియురాలు | Girl jumps before train as lover commits suicide | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఆత్మహత్య - రైలు ఎదుట దూకేసిన ప్రియురాలు

Published Thu, Sep 12 2013 11:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

Girl jumps before train as lover commits suicide

తన ప్రియుడు హౌరా బ్రిడ్జి మీద నుంచి దూకేసినట్లు తెలియడంతో ఆ ప్రియురాలి హృదయం గాయపడింది. అతడులేని జీవితం తనకెందుకని అనుకుంది. అంతే.. మెట్రో రైల్వే స్టేషన్కు చేరుకుని, వేగంగా వస్తున్న రైలు ఎదుటకు దూకేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని కాళీఘాట్ మెట్రో రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది.

రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను  కాళీఘాట్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ప్రియుడు బికాష్ సాహుకు, ఆమెకు ఫోన్లో గొడవ కావడంతో అతడు హౌరా బ్రిడ్జి మీద నుంచి హుగ్లీ నదిలోకి దూకేశాడు. ఆ విషయం తెలియడంతో ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాలీగంజ్లో నివసించే ఆమె.. కాలేజిలో చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement