అక్షింతలు
అక్షింతలు
Published Fri, Apr 1 2016 3:23 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
సాక్షి, చెన్నై : టీఎన్‌పీఎస్‌సీ వర్గాలపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణతో కూడిన పిటిషన్ సమర్పణలో జాప్యం చేసినందుకు గా ను తలా రూ. ఐదు వేలు చొప్పు న జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఇటీవల ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీ పర్వం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా అరుల్ మోళిని నియమిం చారు. గత ఏడాది కొంత కాలం గా ఆయన తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించినా, ఇటీవల ఆయ న పూర్తి స్థాయిలో బాధ్యత చేపట్టారు. అదే సమయంలో ఆ కమిషన్‌కు 11 మంది సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిం ది. అయితే, ఈ కమిటీకి వ్యతిరేకత బయలు దేరింది.
డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, పుదియ తమిళగం నేత కృష్ణస్వామిలతో పాటుగా పలువురు ఈ కమిటీకి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయిం చారు. టీఎన్‌పీఎస్‌సీ నియమ నిబంధనల మేరకు ఈ కమిటీ నియామకం జరగ లేదని, 11 మందిలో ఏడుగురు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు సంబంధించిన కేసులో విచారణలకు హాజరైన వాళ్లు ఉన్నారని ఆరోపించారు. ఈ కమిటీని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ గత నెల విచారణకు వచ్చింది. విచారణ సమయంలో వివరణతో కూడిన పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి, టీఎన్‌పీఎస్‌సీ కార్యదర్శి, సభ్యులకు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నోటీసులు జారీ చేశారు.
అయితే, ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్ప, మిగిలిన వారిలో స్పందన రాక పోవడంతో హైకోర్టు ఆగ్రహానికి గురి కాక తప్పలేదు. గురువారం పిటిషన్ విచారణకు రాగా, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణతో కూడిన నివేదికను దాఖలు చేశారు. మిగిలిన వారి తరఫున హాజరైన న్యాయవాదులు తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో హైకోర్టు కన్నెర్ర చేసింది. కోర్టు సమయం వృధా చేసినందుకు గాను కేసు ఖర్చుల నిమిత్తం టీఎన్‌పీఎస్‌సీ కార్యదర్శితో పాటుగా మిగిలిన వాళ్లు తలా రూ. ఐదు వేలు చొప్పున జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ైజూన్ 13కు వాయిదా వేశారు.
Advertisement
Advertisement