Ilangovan
-
ఎంపిక కొలిక్కి..
సాక్షి, చెన్నై : డీఎంకే, కాంగ్రెస్‌ల నియోజకవర్గాల ఎంపిక కొలిక్కి వచ్చింది. స్నేహపూర్వకంగా నియోజకవర్గాల ఎంపిక ముగియడంతో గురువారం ఆ వివరాల్ని ప్రకటించేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నిర్ణయించారు. డీఎంకేతో పొత్తు, సీట్ల పందేరం కొలిక్కి రావడంతో నియోజకవర్గాల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. తమకుకావాల్సిన నియోజకవర్గాల్ని సాధించుకుంది.కాంగ్రెస్‌లోని గ్రూపు నేతలు తమకు మద్దతు దారులకు పలాన నియోజకవర్గం అంటే, పలాన నియోజకవర్గం కావాలని ప్రత్యేక కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇచ్చిన జాబితాతో బుధవారం సాయంత్రం డిఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నేతృత్వంలోని కమిటీ అడుగు పెట్టింది. అక్కడ డిఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కమిటీతో గంటన్నరకు పైగా సమాలోచించింది. రెండు కమిటీలు స్నేహ పూర్వకంగా నియోజకవర్గాల ఎంపికను పూర్తి చేశాయి. తమకు కావాల్సిన స్థానాల్ని కాంగ్రెస్ చేజిక్కించుకుని సాధించుకుంది. అయితే, కొన్ని స్థానాల విషయంగా మాత్రం డీఎంకే మెట్టు దిగనట్టు, వాటికి బదులుగా ప్రత్యామ్నాయ స్థానాల్ని స్టాలిన్ అప్పగించి ఉన్నారు. నియోజకవర్గాల ఎంపిక ముగిసినానంతరం వెలుపలకు వచ్చిన ఈవీకేఎస్ ఇళంగోవన్, ఆయా నియోజకవర్గాల వివరాల్ని గురువారం ప్రకటిస్తామని ముందుకు సాగారు. -
అక్షింతలు
సాక్షి, చెన్నై : టీఎన్పీఎస్సీ వర్గాలపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణతో కూడిన పిటిషన్ సమర్పణలో జాప్యం చేసినందుకు గా ను తలా రూ. ఐదు వేలు చొప్పు న జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఇటీవల ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీ పర్వం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా అరుల్ మోళిని నియమిం చారు. గత ఏడాది కొంత కాలం గా ఆయన తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించినా, ఇటీవల ఆయ న పూర్తి స్థాయిలో బాధ్యత చేపట్టారు. అదే సమయంలో ఆ కమిషన్‌కు 11 మంది సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిం ది. అయితే, ఈ కమిటీకి వ్యతిరేకత బయలు దేరింది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, పుదియ తమిళగం నేత కృష్ణస్వామిలతో పాటుగా పలువురు ఈ కమిటీకి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయిం చారు. టీఎన్పీఎస్సీ నియమ నిబంధనల మేరకు ఈ కమిటీ నియామకం జరగ లేదని, 11 మందిలో ఏడుగురు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు సంబంధించిన కేసులో విచారణలకు హాజరైన వాళ్లు ఉన్నారని ఆరోపించారు. ఈ కమిటీని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ గత నెల విచారణకు వచ్చింది. విచారణ సమయంలో వివరణతో కూడిన పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి, టీఎన్పీఎస్సీ కార్యదర్శి, సభ్యులకు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నోటీసులు జారీ చేశారు. అయితే, ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్ప, మిగిలిన వారిలో స్పందన రాక పోవడంతో హైకోర్టు ఆగ్రహానికి గురి కాక తప్పలేదు. గురువారం పిటిషన్ విచారణకు రాగా, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణతో కూడిన నివేదికను దాఖలు చేశారు. మిగిలిన వారి తరఫున హాజరైన న్యాయవాదులు తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో హైకోర్టు కన్నెర్ర చేసింది. కోర్టు సమయం వృధా చేసినందుకు గాను కేసు ఖర్చుల నిమిత్తం టీఎన్పీఎస్సీ కార్యదర్శితో పాటుగా మిగిలిన వాళ్లు తలా రూ. ఐదు వేలు చొప్పున జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ైజూన్ 13కు వాయిదా వేశారు. -
నల్లకన్నుకే నా ఓటు
సాక్షి, చెన్నై : సీపీఐ నేత నల్లకన్ను సీఎం పదవికి అర్హుడని, ఆయన రేసులో ఉంటే, తన ఓటు ఆయనకే అని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే తమకు ఆహ్వానం పలకడంతో ఆ దిశగా పొత్తు యత్నాల్లో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తుల్లో మునిగింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. అలాగే, ఆయన వ్యాఖ్యల్ని ఇతర నాయకులు తీవ్రంగా ఖండించే పనిలో పడ్డారు. ఈ సమయంలో శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్భూ ఏకంగా ఇళంగోవన్ సీఎం పదవికి అర్హుడని, ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయని వ్యాఖ్యానిం చడం కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల్లో మరిం త చర్చను వేడెక్కించింది. ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టే వాళ్లు ఓ వైపు ఉంటే, మరో వైపు ఏకంగా తాను కాదు...కమ్యూనిస్టు నేత నల్లకన్ను సీఎం పదవికి అర్హుడన్నట్టుగా ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం మరో చర్చకు తెరలేపినట్టు అయింది. నల్లకన్నుకే ఓటు : కమ్యూనిస్టు సీని యర్ నేత నల్లకన్నుకు అంబేద్కర్ బిరుదును శని వారం రాత్రి ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ కమ్యూనిస్టు నేతను పొగడ్తల్లో ముంచెత్తారు. నల్లకన్నుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు, పొత్తులు ఎలా ఉంటాయో ఏమో తెలియదు గానీ, సీఎం పదవి రేసులో నల్లకన్ను ఉంటే తన మద్దతు ఓటు ఆయనకే అని వ్యాఖ్యానించారు. ఆయన ఉత్తమ నాయకుడు అని వ్యాఖ్యానిస్తూ, ఆ పదవికి అర్హుడేనని స్పందించడంతో ఇప్పటికే ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థితత్వంపై సాగుతున్న చర్చ మరింత వేడెక్కినట్టు అయింది.