‘మహారాణి’ పరువు పోయింది ! | Maharani College Students Fight in Malleswaram | Sakshi
Sakshi News home page

‘మహారాణి’ పరువు పోయింది !

Published Sun, Mar 27 2016 9:31 AM | Last Updated on Fri, Nov 9 2018 4:14 PM

‘మహారాణి’ పరువు పోయింది ! - Sakshi

‘మహారాణి’ పరువు పోయింది !

ఇది బెంగళూరులోని మహరాణి మహిళా కళాశాల... ఈ కళాశాల వద్ద ఇంత మంది పోలీసులు ఉన్నారంటే పోకిరీల పనిపట్టడాని కోసం అనుకుంటే మీరు పొరబడినట్లే.. శనివారం ఉదయం ఈ కళాశాల విద్యార్థినులు రెండు జట్లుగా విడిపోయి జుట్లు పట్టుకుని ఆ కళాశాల పరువు తీశారు. ఈ సంఘటన నగర వాసులను నివ్వెరపరిచింది. ఓ లెక్చరర్ బదిలీ విషయమై ఈ రెండు వర్గాల విద్యార్థినులు వీధిలోకి వచ్చి కొట్టుకోవడంతో పోలీసులు వచ్చి విడిపించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద భద్రత నిర్వహిస్తున్న దృశ్యమే ఇది.
 
బెంగళూరు: మహరాణి కళాశాల విద్యార్థినులు కొట్లాటకు దిగారు. పరీక్షల సమయంలో చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థినులు జుట్లుజుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. వివరాలు....మహారాణి కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ బదిలీ విషయం పై   కొన్ని రోజులుగా మహారాణి కళాశాల విద్యార్థినులు పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రొఫెసర్ బదిలీని నిలిపేయాలని కొందరు విద్యార్థినులు డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రొఫెసర్ బదిలీ సబబేనని మరికొంత మంది విద్యార్థినులు చెబుతున్నారు.
 
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మహారాణి కళాశాల ప్రాంగణంలో ఉన్నట్టుండి ఆర్ట్స్, కామర్స్ విభాగాలకు చెందిన విద్యార్థినులు ఇదే విషయంపై చర్చకు దిగారు. ఈ చర్చ చిలికి చిలికి గాలి వానగా మారి ఇరు విభాగాల విద్యార్థినుల మధ్య గొడవకు దారి తీసింది.
 
పోలీసులు అడ్డుపడి వారిని విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ, జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన పోలీసులు కళాశాలకు సెలవు ప్రకటించి విద్యార్థినులను ఇళ్లకు పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement