దళితులు ప్రేమించకూడదా?
Published Wed, Apr 12 2017 12:50 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
వరంగల్ అర్బన్: దళితుల మీద జరగుతున్న దాడులకు నిరసనగా ఏప్రిల్ 14న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపనున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని.. దళితుల మీద దాడులను ప్రజా ప్రతినిధులు, పోలీసులే ప్రోత్సహిస్తున్నారు.
దళితులకు ప్రేమించే హక్కులేదా.. వాళ్లు ప్రేమించడమే నేరమా.. దానికి హత్యలే పరిష్కారమా.. ఎమ్మెల్యేలే దాడులను ప్రోత్సహిస్తూ.. కేసులను నీరుగారుస్తున్నారు.. కంచె చేను మేసిన చందంగా చట్టాన్ని పరిరక్షించే వారే చట్టాన్ని దిక్కరిస్తున్నారని ఆరోపించారు. దళితులు ఈ ప్రభుత్వానికి శిక్ష వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని’’ హెచ్చరించారు.
Advertisement
Advertisement