కర్ణాటకలో భారీ చోరీ | Massive theft in Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో భారీ చోరీ

Published Wed, Sep 13 2017 2:33 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

Massive theft in Karnataka

బనశంకరి(బెంగళూరు): కన్నడ నటుడు దొడ్డణ్ణ అల్లుడైన కె.సి.వీరేంద్ర ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 21 కేజీల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన చోటుచేసు కుంది. చెళ్లకెరెలో వీరేంద్ర నివాసముంటున్నారు. సోమవారం రాత్రి దుండగులు ఇంటి తాళం పగలకొట్టి లోపలికి చొరబడ్డారు.

వీరేంద్ర గది లాకర్‌లో ఉన్న 21 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న వీరేంద్ర సోదరుడు తిప్పేస్వామి ఇంటిలోకి కూడా చొరబడి రూ.10 లక్షల 70 వేల నగదు దోచుకెళ్లారు. ఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కొద్ది నెలల కిందట ఐటీ శాఖ చేసిన దాడుల్లో.. వీరేంద్ర ఇంటి బాత్రూమ్‌ గోడల్లో దాచిపెట్టిన రూ.6 కోట్లు నగదు బయటపడిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement