‘మీడియా’కు కార్పొరేట్ సంస్కృతి
స్వరూపాన్ని కోల్పోతున్న పత్రికారంగం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : ఇటీవల ‘మీడియా’కు కార్పొరేట్ సంస్కృ సోకిందని, తద్వారా ఆ రంగం తన సహజ రూపును కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. మంగళవారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కౄ్ణలో సీనియర్ పాత్రికేయుడు సి.ఎం.రామచంద్ర రాసిన ‘ఎ బ్రష్ విత్ సెలబ్రిటీష్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు ఉన్న మీడియా రంగానికి ఇప్పటి మీడియా పనితీరుకు అనేక వ్యత్యాసాలున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సీనియర్ పాత్రికేయుడు సి.ఎం.రామచంద్ర తన రచనల ద్వారా సమాజ సేవ, దేశ సేవలో భాగస్వాములయ్యారని అన్నారు. రామచంద్ర వంటి వ్యక్తుల జీవితం నేటి తరం పాత్రికేయులకు ఆదర్శమని తెలిపారు. ‘ఎ బ్రష్ విత్ సెలబ్రిటీష్’ పుస్తకంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సర్ సి.వి.రామన్, వాజ్‌పేయి, దలైలామా, దేవరాజ్ అరసు, బరాక్ ఒబామా వంటి వ్యక్తుల జీవితాలను పరిచయం చేశారని చెప్పారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.ఎన్.వెంకటాచలయ్య, రాష్ట్ర ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్, ఎమ్మెల్సీ ఉగ్రప్ప పాల్గొన్నారు.