నటి కుష్బూపై వలర్మతి ధ్వజం | Minister valarmati fairs on actress Kusbu, | Sakshi
Sakshi News home page

నటి కుష్బూపై వలర్మతి ధ్వజం

Published Mon, Mar 28 2016 3:48 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

నటి కుష్బూపై వలర్మతి ధ్వజం - Sakshi

నటి కుష్బూపై వలర్మతి ధ్వజం

టీనగర్: నటి కుష్బూపై మంత్రి వలర్మతి ధ్వజమెత్తారు. నాగర్‌కోవిల్ అన్నా స్టేడియం ఎదుట ఈనెల 24వ తేదీన జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో నటి కుష్బూ పాల్గొని ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో ఆకులు రాలిపోతాయని (రెండాకులు) హస్తం సాయంతో సూర్యుడు (ఉదయ సూర్యుడు) ఉదయిస్తాడని ఆవేశంగా మాట్లాడారు. కుష్బూ ప్రసంగానికి మంత్రి వలర్మతి ప్రతిగా స్పందించారు. కాంగ్రెస్ బహిరంగ సభ జరిగిన అదే అన్నా స్టేడియం ఎదుట శనివారం రాత్రి అన్నాడీఎంకే బహిరంగ సభ జరిగింది.

ఆ సభలో వలర్మతి మాట్లాడుతూ కొన్న రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ సభలో ఆకులు రాలిపోతాయని కుష్బూ తెలిపారని, కాని అవి రాలిపోవని ఎందుకంటే ఎంజీఆర్‌చే పెంచబడిన రెండాకులు నేడు మర్రివృక్షం లా అభివృద్ధి చెందాయని, ఇవి సాధారణ ఆకులు కావని వైద్యానికి ఉపయోగపడే అమూల్యమైనవని పేర్కొన్నారు. ఈ రెండాకులను నశింపచేసే శక్తి ఎవరికీ లేదన్నారు. జయలలిత గురించి వారికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కొందరు కేరళను చూడండి, కర్ణాటకను చూడండని అంటున్నారని, అయితే ఆయా రాష్ట్రాల వారు తమిళనాడులో చక్కని పరిపాలన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement