ఆస్తి కోసమే లీనా శర్మ హత్య! | Missing Delhi girl Leena Sharma found murdered in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసమే లీనా శర్మ హత్య!

Published Mon, May 16 2016 1:02 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ఆస్తి కోసమే లీనా శర్మ హత్య! - Sakshi

ఆస్తి కోసమే లీనా శర్మ హత్య!

ఢిల్లీ: తనకు చట్ట ప్రకారం దక్కాల్సిన ఆస్తి కోసం పోరాడిన యువతి లీనా శర్మ దారుణ హత్యకు గురైంది. ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ స్కూల్లో ఉద్యోగాన్ని సైతం వదులుకొని తన ఆస్తిని దక్కించుకోవడం కోసం పోరాడే క్రమంలోనే.. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయిందనే విషయం వెల్లడైంది.

వివరాల్లోకి వెళ్తే.. తల్లి, తాత మరణంతో మధ్య ప్రదేశ్లోని సోహగ్ పూర్లో కోట్ల రూపాయల విలువచేసే భూములు, ఆస్తులకు ఢిల్లీకి చెందిన యువతి లీనా శర్మ వారసురాలైంది. అయితే ఆ ఆస్తులపై కన్నేసిన లీనా శర్మ మామ ప్రదీప్ శర్మ.. ఆమెను ఢిల్లీ నుంచి పథకం ప్రకాంరం రప్పించి హత్యచేశాడని పోలీసులు తేల్చారు. సుమారు 15 రోజులుగా కనిపించకుండా పోయిన లీనా శర్మ ఉదంతాన్ని ఆమె స్నేహితులు ఫేస్బుక్ ద్వారా విస్తృతంగా వెలుగులోకి తెచ్చరు. అయితే దీనిపై విచారణ చేపట్టిన చేపట్టిన అధికారులు వెల్లడించిన విషయాలు వారిని నివ్వెరపోయేలా చేశాయి.

దృశ్యం సినిమాలో మాదిరిగా..
లీనా శర్మను పథకం ప్రకారం హత్య చేసిన దుండగులు.. కేసును తప్పుదోవ పట్టించేందుకు దృశ్యం సినిమాని ఆధారంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. లీనా శర్మకు సంబంధించిన రెండు ఫోన్లను దుండగులు జబల్ పూర్ రైల్లో పడేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. అంతే కాదు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఉప్పు, యూరియా మిశ్రమంతో పూడ్చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రదీప్ శర్మతో పాటు మరో ఇద్దరు అనుచరులను కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టడం కోసం మరోసారి కస్టడీకి అనుమతివ్వాలని కోర్టును కోరనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement