సెమినార్‌లో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జయేష్ లేలే
సాక్షి, ముంబై: మానవుని నిత్య జీవితంలో ప్రతిదీ ప్లాస్టిక్ వాడకంతో ముడిపడి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ జయేష్ లేలే అభిప్రాయపడ్డారు. ఏక్ట్ ఇండియా (్చఛ్టిజీఛీజ్చీ) ఆధ్వర్యంలో ‘నో మోర్ ప్లాస్టిక్-యూజ్ గ్లాస్ బాటిల్’ అనే అంశంపై గురువారం ముంబైలో ఓ సెమినార్ జరిగింది. ఈ సెమినార్‌కు పలువురు వైద్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ లేలే మాట్లాడుతూ ఉదయం టూత్ బ్రష్ మొదలుకుని వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్‌లు, భోజనం చేసే ప్లేట్లు, షాంపు బాటిళ్లు, మందు బాటిళ్లు, అయిల్, టానిక్ బాటిళ్లు, పిల్లలకు పాలు పట్టించే సీసాలు, శీతల పానీయాల బాటిళ్లు, పిల్లలకు అన్నం తినిపించే స్పూన్లు ఇలా ప్రతీ వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే అన్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో సెలైన్ బ్యాగులు, రక్తం భద్రపర్చిన బ్యాగులు, ఇంజక్షన్లు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే వాడుతున్నారన్నారు. వాటిని వినియోగించడంవల్ల ఝజీటఛ్చిటటజ్చీజ్ఛట,ఆస్తమ లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అదే గాజుతో తయారైన వస్తువులను వాడితే ఈ వ్యాధుల వ్యాప్తి 80 శాతానికి పైగా తగ్గిపోతుందని చెప్పారు. ముఖ్యంగా గర్భిణిలు ప్లాస్టిక్‌తో తయారైన వస్తువులు వాడకుండా ఉండాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ సోకడంతోపాటు కడుపులో ఉన్న బిడ్డపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు. డాక్టర్ తుషార్ మాట్లాడుతూ ముఖ్యంగా మనుషులు ఆరోగ్యం కంటే ఫ్యాషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్లాస్టిక్‌తో తయారైన వస్తువులు ఎలాగైనా, ఎక్కడికైనా పట్టుకెళ్లడం చాలా సులభం కాని వాటివల్ల ప్రమాదం పొంచి ఉందని గుర్తించలేకపోతున్నారన్నారు. కొత్త బాటిళ్ల వల్ల ప్రమాద స్థాయి అంతగా లేకపోయినా రీ సైక్లింగ్ బాటిళ్లతో పెను ప్రమాదం పొంచి ఉందన్నారు.
అతి తక్కువ డిగ్రీల వేడిమిలోనే ప్లాస్టిక్ బాటిళ్లు కరిగిపోతాయి. అదే గాజు సీసాలైతే 130 డిగ్రీల వేడిమిలో కరగడం వల్ల రీ సైక్లింగ్ చేసినప్పటికీ వాటి వల్ల ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మానవుని సరాసరి జీవితకాలం తగ్గిపోయే ప్రమాదముందని, అందువల్ల సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బాటిళ్లకు దూరంగా ఉండాలని తుషార్ సలహా ఇచ్చారు.
ప్లాస్టిక్ వాడకంతో ఇబ్బందులెన్నో..
Published Thu, Dec 4 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM
Advertisement
Advertisement