సాక్షి, ముంబై: తెలంగాణలో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేస్తున్న పలువురు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ముంబై తెలంగాణా జేఏసీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కల్వకుంట కవితకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ప్రచార ర్యాలీ లో ముంబై టీ జాక్ బృందం పాల్గొంది. అనంతరం ముంబైలో ఉంటున్న తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ముంబైకర్ల పాత్ర ఎంతో ఉందని, ఇక్క డ జరిగిన ప్రతీ ఉద్యమానికి తాము సంఘీభావం తెలిపామని, కొన్ని ఉద్యమాల్లో స్వయంగా తెలంగాణకు వచ్చి పాల్గొన్నామని ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల కిందట బయలుదేరిన ఎనిమిది మంది ముంబై టీ-జాక్ సభ్యు ల్లో ముగ్గురు నల్గొండలో, మిగతా వారు నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సోమవారం ప్రచార సభ ముగియగానే తిరి గి ముంబైకి వస్తున్నట్లు సభ్యులు మూల్‌నివాసి మాల, బద్ది హేమంత్‌కుమార్, దేవానంద్ నాగెళ్ల తెలిపారు.
టీఆర్‌ఎస్ తరఫున ముంబై టీజాక్ ప్రచారం
Published Sun, Apr 27 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement
Advertisement