
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతా..
చెన్నై: ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానని నటి అనుష్క తెలిపింది. అనుష్క నటించిన రెండు భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. కొన్నేళ్లుగా ఆమె వివాహం గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నా... అనుష్క మాత్రం కొత్త చిత్రాలకు వరుసగా కాల్షీట్లు ఇస్తునే ఉంది. ఇలావుండగా ఓవ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుష్క వీడియో చిత్రాలు ఇంటర్నెట్‌లో విడుదలవుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వివాహం గురించి అనుష్కను ప్రశ్నించగా పెళ్లి గురించి ఆలోచించే సమయం ప్రస్తుతం లేదని తెలిపింది. ఎందుకంటే తాను నటిస్తున్న భారీ చిత్రాల పనులు ఇంకా కొనసాగుతున్నాయని, వివాహం అనుకోగానే జరగదని, కాలం కలిసి రావాలని పేర్కొంది. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహించనున్న ‘సైజ్ జీరో’ చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో అనుష్క ప్రధాన పాత్రలు పోషించింది. ఆ చిత్రాలు వేసవిలో విడుదల కానున్నాయి.