వారిద్దరూ ఒకటవుతారు.. | Nana Patekar takes on Uddhav Tirkey, Raj Tirkey | Sakshi
Sakshi News home page

వారిద్దరూ ఒకటవుతారు..

Published Tue, Oct 7 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

వారిద్దరూ ఒకటవుతారు..

వారిద్దరూ ఒకటవుతారు..

ఉద్ధవ్, రాజ్‌ఠాక్రేలపై సినీ నటుడు నానా పటేకర్

సాక్షి, ముంబై: శాసనసభ ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కచ్చితంగా ఒకటవుతారని ప్రముఖ మరాఠీ, హిందీ సినీ నటుడు నానా పటేకర్  ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా చానెల్ తో మంగళవారం జరిగిన మాటామంతి కార్యక్రమంలో పటేకర్ మాట్లాడుతూ ఇద్దరు సోదరులు ఒక్కటవ్వాలని గతంలో తను అనేక ప్రయత్నాలు చేశానని, ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికెన్ని స్థానాలు వస్తాయో అన్న విషయం మీదే వారిద్దరి కలయిక అధారపడి ఉందని అన్నారు. అన్ని పార్టీలూ ఒంటరిగా పోటీచేస్తున్నాయి కాబట్టి ఇందులో ఎవరు లాభపడతారో ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు. ఓటర్లు మాత్రం మేలుకుని మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని కోరారు.  నేర చరిత్ర గల నాయకులు ఏ పార్టీవారైనా సరే వారిని ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement