► డీఎంకే వర్గాలకు వేడుకోలు
► గోపాలపురంలో కరుణకు విశ్రాంతి
సాక్షి, చెన్నై : ఆసుపత్రి నుంచి డీఎంకే అధినేత ఎం కరుణానిధి గోపాలపురం చేరుకున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉం డడంతో ఆయన్ను పరామర్శించేం దుకుఎవ్వరూ రావొద్దు అని డీఎంకే అధిష్టానం విన్నవించుకుంది. డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి అక్టోబరు నెలాఖరులో అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. అలర్జీ కారణంగా ఏర్పడ్డ దద్దుర్లతో నెలన్నర రోజులుగా ఆయన బాధ పడుతూ వచ్చారు. ఈ సమయంలో ఎవర్నీ గోపాలపురం వైపుగా అనుమతించ లేదు. అనుమతులు రద్దు చేస్తూ డీఎంకే కార్యాలయం ప్రకటించింది. ఈ సమయంలో డిసెంబరు ఒకటో తేదీన ఉదయం ఆయన్ను ఆళ్వార్ పేటలోని కావేరి ఆసుపత్రికి తరలించిన సమాచారం డీఎంకే వర్గాల్ని ఆందోళనలో పడేసింది.
తమ నాయకుడికి ఏమైందో అన్న ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. అరుుతే, ఆయనకు ఎలాంటి సమస్య లేదని, కేవలంలో వైద్య పరీక్షలు మాత్రమేనని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అలాగే, న్యూట్రీషన్, డీహైడ్రేషన్ సమస్యతో కరుణానిధి బాధ పడుతున్నారని కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించారుు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కరుణానిధి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఆయన తన స్వగృహం గోపాలపురానికి చేరుకున్నారు. తన కారులోనే కూర్చుని గోపాల పురం వైపుగా కదిలారు. ఆయన వాహనం వెంట స్టాలిన్, కనిమొళి, మురసోలిమారన్, దురైమురుగన్, ఏ.రాజా తదితర నాయకుల వాహనాలు గోపాల పురం వైపుగా దూసుకెళ్లాయి.
కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆసుపత్రి నుంచి రావడంతో డీఎంకే వర్గాలు ఆనందంలో మునిగాయి. అయితే, ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు వైద్యులు సూచించడంతో, గోపాలపురం వైపుగా పరామర్శల తాకిడిని నియంత్రించేందుకు డీఎంకే వర్గాలు నిర్ణయించాయి. కావేరి వైద్యులు ఉదయం, సాయంత్రం వేళల్లో కరుణానిధిని ఇంటి వద్దకు వెళ్లి పరీక్షించడంతో పాటుగా, విశ్రాంతి తప్పనిసరిగా స్పష్టం చేశారు. అదే సమయంలో కరుణానిధి మెరీనా తీరంలోని జయలలిత సమాధిని సందర్శించనున్నట్టుగా ప్రచారం ఊపందు కోవడంతో డీఎంకే వర్గాలు ఆగమేఘాలపై గురువారం ప్రకటన విడుదల చేశారుు. కరుణానిధి ఎక్కడకు వెళ్లడం లేదని, ఆయన పూర్తి స్థారుులో విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని అందులో వివరించారు. ఆయన్ను పరామర్శించేందుకు ఎవ్వరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
పరామర్శలు వద్దు
Published Fri, Dec 9 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
Advertisement
Advertisement