
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి శుక్రవారం ఉదయం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లోపే సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది.