ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ : రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు చేయాలనే యోచన మరోసారి తెరపైకి వచ్చింది. దీర్ఘకాలం కిందట ఈ ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపించింది. రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు పురస్కరించుకుని ఇరుగు పొరుగు రాష్ట్రాలు బిహార్, ఆంధ్రప్రదేశ్ సందర్శించి అక్కడ కొనసాగుతున్న ఈ విధానాన్ని పర్యవేక్షక బృందం పరిశీలిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ప్రకటించారు. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో విధా న పరిషత్ పని తీరు, కార్యాచరణ సమీక్షిస్తాయి. డాక్టర్ నృసింహ చరణ్ అధ్యక్షతన విధాన పరిషత్ పర్యవేక్షక కమిటీ ఏర్పాటు అయింది.
ఆయన అధ్యక్షతన ప్రమీలా మల్లిక్, భుజొబొలొ మాఝి, మనోహర్ రంధారి, నితీష్ గంగదేవ్ సభ్యులుగా బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఏర్పాటు శైలి,పనితీరు, కార్యాచరణని పరిశీలిస్తారు. లోగడ 2015 సంవత్సరంలో రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ సభ్యులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం 169 ఆర్టికల్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విధాన పరిషత్ విధానం కొనసాగుతుంది. బిహారు, జమ్మూ–కశ్మీరు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విధాన పరిషత్ వ్యవస్థ కొనసాగుతుంది. పలు రంగాల్లో నిపుణుల్ని చట్టపరమైన వ్యవహారాల్లో ప్రతినిథులుగా అవకాశం కల్పించేందుకు వీలు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment