కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు | Old Man Going Hospital Taken Snake in Tamil nadu | Sakshi
Sakshi News home page

కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు

Published Fri, Feb 22 2019 11:35 AM | Last Updated on Fri, Feb 22 2019 11:35 AM

Old Man Going Hospital Taken Snake in Tamil nadu - Sakshi

రంగనాథన్‌ను కాటేసిన పాము

అన్నానగర్‌: విరుదాచలంలో తనను కాటేసిన పాముతో ఓ వృద్ధుడు బుధవారం ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలం సమీపం చిన్నకండియాంగప్పనికి చెందిన రంగనాథన్‌ (87) రైతు. ఇతను బుధవారం రాత్రి విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి ఓ ప్లాస్టిక్‌ సంచిలో సుమారు మూడున్నర అడుగుల ఓ పాముని తీసుకువచ్చాడు. చికిత్స కోసం వచ్చిన రోగులు, నర్సులు పాముని చూడగానే పరుగులు తీశారు. డాక్టర్లు రంగనాథన్‌ను విచారించగా.. తనను పాము కరచినట్లు చెప్పి, చికిత్స చేయాలని కోరాడు. డాక్టర్లు అతనికి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఆ పామును సమీపంలోని కాప్పుకోటలో వదిలిపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement