పల్లెకు పరుగులు | Open runs | Sakshi
Sakshi News home page

పల్లెకు పరుగులు

Published Sun, Feb 16 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

Open runs

  • శివారు గ్రామాలకు బీఎంటీసీ బస్సులు
  •  ఫీడర్ సర్వీసులుగా గ్రామీణుల చెంతకు
  •  సాక్షి, బెంగళూరు : నగర శివారు గ్రామాల ప్రజలకు ఉత్తమ రవాణా సౌకర్యం కల్పించడానికి బీఎంటీసీ ఫీడర్ సర్వీసులను ప్రవేశ పెట్టింది. ‘సంపర్క సారిగె’ పేరిట ప్రారంభించిన ఈ సర్వీసులను ఆనేకల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు శివారు గ్రామాలకు బీఎంటీసీ బస్సుల సేవలు అందడం లేదన్నారు. దీని వల్ల ఆయా గ్రామాల వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం వారికి కూడా ‘మిడి’ రూపంలో బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.

    బెంగళూరు చుట్టుపక్కల 12 పారిశ్రామిక వాడలకు దగ్గరగా ఉన్న గ్రామాలకు మిడి బస్సులు సేవలు అందిస్తాయన్నారు. తొలుత చందాపుర, అత్తిబెలె పారిశ్రామిక వాడల పరిధిలోని 77 గ్రామాల ప్రజలకు ఈ సదుపాయాన్ని కలిగిస్తున్నామని తెలిపారు. అర గంటకో బస్సు చొప్పున మొత్తం ఏడు రూట్లలో 27 బస్సులను ప్రవేశ పెట్టామని వెల్లడించారు. ఈ సంఖ్యను 250కు పెంచుతామని చెప్పారు. మిగిలిన పారిశ్రామిక వాడలకు కూడా దశల వారీ ఫీడర్ సర్వీసులను విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే. సురేష్ పాల్గొన్నారు.
     
     ఈ సర్వీసుల ప్రత్యేకతలు

     = 30 సీట్లతో సాధారణ బస్సు కంటే పొడవు తక్కువ. దీని వల్ల గ్రామీణ రోడ్లలో సులభంగా తిరగడానికి వీలవుతుంది.
     
     =  ఒక్కొక్క బస్సు ఖరీదు రూ.22 లక్షలు
     
     =  ఏదైనా బస్సులో ‘గమ్య స్థానం టికెట్’ తీసుకుంటే, మధ్యలో ఎన్ని బస్సులైనా మారవచ్చు. టికెట్టు గడువు మూడున్నర గంటలు.
     
     =  పారిశ్రామిక వాడల ప్రత్యేక సర్వీసులైన ‘బిగ్‌ట్రంక్’ బస్సుల్లో కూడా ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయి.
     
     రూట్లు చందాపుర హబ్
     3ఎఫ్-1  అనేకల్-దొమ్మసంద్ర, 3ఎఫ్-2 ఇడ్లవాడి సర్కిల్-ఆడిగొండనహళ్లి, 3ఎఫ్-3  జిగణి ఏపీసీ సర్కిల్-హందెనహళ్లి, 3ఎఫ్-4  శెట్టి హళ్లి-ఎపీఎంసీ మార్కెట్ (హుస్కూరు), అత్తిబెలె హబ్, 3ఎఫ్-5  అనేకల్-సర్జాపుర, 3ఎఫ్-6  దాసనపుర-సర్జాపుర, 4ఎఫ్-7 సమందూరు-నరసాపుర
     

Advertisement
Advertisement