నగరంలో నూతన చక్ర బీఎంటీసీ బస్సులు
మంత్రి రామలింగారెడ్డి
కృష్ణరాజపురం: ప్రతి ఒక్కరూ తమ స్వంత వాహనాలను పక్కకు పెట్టి బీఎంటీసీ బస్సులను ఉపయోగించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయాలని, ఆంతేకాకుండ పరిసరాలను సంరక్షించాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి కోరారు. సోమవారం వైట్‌పీల్డ్‌లో రవాణ శాఖ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన 60వ బస్ డే, మొబైల్‌అఫ్లికేషన్, నూతన చక్ర బస్సులను ఆయన ప్రా రంభించారు. ఆయన మాట్లాడుతూ బెంగళూ రు నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపొతుందన్నారు. బీఎంటీసి బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఇంధనం పొదుపు కావడంతోపాటు, కార్యాలయాలకు సమయానికి చేరుకొవచ్చునన్నారు.
మహాదేవుపుర పరిధి లో ఐటీబీటి సంస్థలు అధికంగా ఉన్నందున ఇక్కడి ఉద్యోగుల కోసం బీఎంటిసీ వజ్ర బస్సు సేవలను అందిస్తున్నామన్నారు. ఈ బస్సుల్లో వైఫేను కూడా ఏర్పాటు చేశామన్నా రు. ఈ సౌకర్యం కల్పించినా చార్జీలు పెంచలేదన్నారు. దీనిని ఐటీ ఉద్యోగులు సద్విని యో గం చేసుకోవాలన్నారు. త్వరలో నే మొబైల్ ఆఫ్లీకేషన్ అములు చేస్తున్నట్లు బస్సులు వచ్చే సమయం, ప్రస్తుతం ఉన్న చోటును, వచ్చే మార్గంలో ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో బీబీఎంపీ కార్పొరేటర్ ఉదయ్‌కుమా ర్, పిళ్ళప్ప, కేఎస్‌ఆర్‌టీసీ అధ్యక్షుడు నాభి రాజు జైన్, బీఎంటీసీ ఉపాద్యక్షుడు వీఎస్.ఆరాధ్య, తదితరులు హాజరయ్యారు.