Minister ramalinga Reddy
-
లంకేశ్ కేసులో పురోగతి
సాక్షి, బెంగళూరు: మహిళా పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గత రెండు రోజులుగా విచారిస్తోంది. అనుమానితులందరూ ఓ వివాదాస్పద సంస్థకు చెందినవారని విశ్వసనీయ సమాచారం. గదగ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్న సిట్ బృందం వీరిని బెంగళూరుకు తీసుకువచ్చి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. కాగా, హత్య జరిగినప్పటి నుంచి దాదాపు 2,000 గంటల నిడివి గల వేర్వేరు సీసీటీవీ ఫుటేజీలను, దాదాపు కోటి ఫోన్ కాల్స్‌ను దర్యాప్తు బృంద సభ్యులు పరిశీలించారు. నిందితులు ఎర్రని పల్సర్ బైక్‌లో వచ్చినట్లు తేలడంతో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ రంగు పల్సర్ బైక్‌ల వివరాలను పరిశీలిస్తున్నారు. హంతకుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆదివారం జరిగిన పలు కార్యక్రమాల్లో కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి చెప్పడం గమనార్హం. -
బస్సుల్లో నిఘా వ్యవస్థ
ఆరు నెలల్లో అన్ని కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మంత్రి రామలింగారెడ్డి(ఫైల్) బెంగళూరు: ఆరు నెలల్లో 16వేల కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. అంతేకాక రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలఓ సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారమిక్కడి కేపీసీసీ కార్యాలయానికి వచ్చిన రామలింగారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్లో రోడ్డు రవాణా సంస్థను మరింత అభివృద్ధి పరిచేందుకు అధిక ప్రాధాన్యం కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరినట్లు చెప్పారు. డీజిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో చార్జీలను కూడా తగ్గిస్తారా? అన్న విలేకరుల ప్రశ్నపై మంత్రి రామలింగారెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక మార్కోపోలో బస్‌ల కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే నివేదిక అందిందని, ఈ నివేదికలో ఎవరినైతే నిందితులుగా పేర్కొన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జార్జితో భిన్నాభిప్రాయాలు లేవు..... ఇక బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కె.జె.జార్జ్‌తో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని రామలింగారెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసం ప్రతిపక్ష సభ్యులతో సైతం కలిసి మెలిసి పనిచేసే తాము జార్జ్‌తో ఎందుకు విబేధిస్తానని ప్రశ్నించారు. జార్జ్‌కు బెంగళూరు నగర అభివృద్ధి శాఖను కేటాయించడంపై తనకెలాంటి అభ్యంతరాలు లేవని, జార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో చక్కగా బెంగళూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. -
పని చేయకపోతే సెలవులో పంపిస్తాం
బీబీఎంపీ అధికారులకు మంత్రి రామలింగారెడ్డి హెచ్చరిక బెంగళూరు(బనశంకరి) : నగరంలో చెత్త సమస్య, పోస్టర్లు, ఫ్లెక్సీలను నియంత్రించని అధికారులను సెలవుపై ఇళ్లకు పంపుతామని బెంగళూరు ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. సాథనిక మల్లేశ్వరంలోని ఐపీపీ సభాంగణంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖా మంత్రి దినేష్ గుండూరావు, ఎమ్మెల్యేలు, పాలికె సీనియర్ అధికారులతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. రహదారులపై మట్టి కుప్పలు, చెత్త రాశులు కనిపిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంలో పదేపదే హైకోర్టు నుంచి అక్షింతలు వేసుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అధికారులకు హితవు పలికారు. పలు కార్యక్రమాల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను బాధ్యులపై చర్యలు చేపట్టి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. ఇందుకు ఏఆర్ఓ నేతృత్వం వహించి, జాయింట్ కమిషనర్, ఉప విభాగ అధికారి, పోలీస్ అధికారులతో సభ నిర్వహించి, పోస్టర్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే సురేష్ కుమార్ మాట్లాడుతూ... నగరంలో ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ స్పందిస్తూ మొబైల్ టవర్ల నియంత్రణ పాలికె పరిధిలోకి రాదన్నారు. అయితే టవర్లు ఏర్పాటు చేసేవారిపై నిఘా వహించాలని అధికారులకు సూచిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గోపాలయ్య, మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ కే.రంగణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో నూతన చక్ర బీఎంటీసీ బస్సులు
మంత్రి రామలింగారెడ్డి కృష్ణరాజపురం: ప్రతి ఒక్కరూ తమ స్వంత వాహనాలను పక్కకు పెట్టి బీఎంటీసీ బస్సులను ఉపయోగించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయాలని, ఆంతేకాకుండ పరిసరాలను సంరక్షించాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి కోరారు. సోమవారం వైట్పీల్డ్లో రవాణ శాఖ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన 60వ బస్ డే, మొబైల్అఫ్లికేషన్, నూతన చక్ర బస్సులను ఆయన ప్రా రంభించారు. ఆయన మాట్లాడుతూ బెంగళూ రు నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపొతుందన్నారు. బీఎంటీసి బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఇంధనం పొదుపు కావడంతోపాటు, కార్యాలయాలకు సమయానికి చేరుకొవచ్చునన్నారు. మహాదేవుపుర పరిధి లో ఐటీబీటి సంస్థలు అధికంగా ఉన్నందున ఇక్కడి ఉద్యోగుల కోసం బీఎంటిసీ వజ్ర బస్సు సేవలను అందిస్తున్నామన్నారు. ఈ బస్సుల్లో వైఫేను కూడా ఏర్పాటు చేశామన్నా రు. ఈ సౌకర్యం కల్పించినా చార్జీలు పెంచలేదన్నారు. దీనిని ఐటీ ఉద్యోగులు సద్విని యో గం చేసుకోవాలన్నారు. త్వరలో నే మొబైల్ ఆఫ్లీకేషన్ అములు చేస్తున్నట్లు బస్సులు వచ్చే సమయం, ప్రస్తుతం ఉన్న చోటును, వచ్చే మార్గంలో ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో బీబీఎంపీ కార్పొరేటర్ ఉదయ్‌కుమా ర్, పిళ్ళప్ప, కేఎస్ఆర్టీసీ అధ్యక్షుడు నాభి రాజు జైన్, బీఎంటీసీ ఉపాద్యక్షుడు వీఎస్.ఆరాధ్య, తదితరులు హాజరయ్యారు. -
రూ. 1 తగ్గింది !
సగటున 5 శాతం మాత్రమే తగ్గిన బస్సు ఛార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలు ఇంతకంటే తగ్గించడం కుదరదన్న మంత్రి బెంగళూరు:రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థలోని నాలుగు విభాగాల బస్ చార్జీలను తగ్గిస్తూ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన బస్సు చార్జీలు అమలు కానున్నాయి. సగటున 5 శాతం కంటే తక్కువగా ఈ తగ్గింపు ఉండడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. ధరలు పెంచే సమయంలో గరిష్టంగా 20 శాతం పెంచే ప్రభుత్వం తగ్గింపులో మాత్రం ఉదారస్వభావాన్ని కనబరచకపోవడాన్ని రవాణాశాఖ అధికారులు తప్పుబడుతున్నారు. ఛార్జీల తగ్గింపు ధరలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి మీడియాకు వివరించారు. బీఎంటీసీ సంస్థలో మొదటి స్టేజ్‌కు రూ.1, అటుపై 9,12,13, 16,17,18, 19,22,23 స్టేజ్‌లకు రూపాయి చొప్పున టికెట్టు ధరలు తగ్గాయి. అంటే రెండు నుంచి ఎనిమిది స్టేజీల మధ్య ఎటువంటి తగ్గింపు లేదు. కేఎస్ఆర్టీసీ, ఎన్‌డబ్యూకేఆర్టీసీ, ఎన్ఈకేఆర్టీసీ విభాగాల్లోని ఆర్డినరీ సర్వీసుల్లో సబ్స్టేజ్ 2 (2ఎస్) రెండు రూపాయల తగ్గింపు. 4,6,7,8,12,13,14,15,16,17 స్టేజీలకు రూ.1 తగ్గించారు. సిటీ/సబ్-అర్బన్ సర్వీసుల్లో 1,2,13 స్టేజీలకు రూపాయి తగ్గించారు. స్టేజీ 3కు రెండు రూపాయలు తగ్గించారు. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కనిష్టంగా రూ.1 గరిష్టంగా రూ.11 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలవారి, వికలాంగులు, వృద్ధులు తదితర పాసు ధరల్లో మార్పులేదు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ధరలను తగ్గించామని, ఇంతకు మించి ఎక్కువ తగ్గించలేమని మంత్రి స్పష్టం చేశారు.