bmtc buses
-
నగరంలో నూతన చక్ర బీఎంటీసీ బస్సులు
మంత్రి రామలింగారెడ్డి కృష్ణరాజపురం: ప్రతి ఒక్కరూ తమ స్వంత వాహనాలను పక్కకు పెట్టి బీఎంటీసీ బస్సులను ఉపయోగించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయాలని, ఆంతేకాకుండ పరిసరాలను సంరక్షించాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి కోరారు. సోమవారం వైట్పీల్డ్లో రవాణ శాఖ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన 60వ బస్ డే, మొబైల్అఫ్లికేషన్, నూతన చక్ర బస్సులను ఆయన ప్రా రంభించారు. ఆయన మాట్లాడుతూ బెంగళూ రు నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపొతుందన్నారు. బీఎంటీసి బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఇంధనం పొదుపు కావడంతోపాటు, కార్యాలయాలకు సమయానికి చేరుకొవచ్చునన్నారు. మహాదేవుపుర పరిధి లో ఐటీబీటి సంస్థలు అధికంగా ఉన్నందున ఇక్కడి ఉద్యోగుల కోసం బీఎంటిసీ వజ్ర బస్సు సేవలను అందిస్తున్నామన్నారు. ఈ బస్సుల్లో వైఫేను కూడా ఏర్పాటు చేశామన్నా రు. ఈ సౌకర్యం కల్పించినా చార్జీలు పెంచలేదన్నారు. దీనిని ఐటీ ఉద్యోగులు సద్విని యో గం చేసుకోవాలన్నారు. త్వరలో నే మొబైల్ ఆఫ్లీకేషన్ అములు చేస్తున్నట్లు బస్సులు వచ్చే సమయం, ప్రస్తుతం ఉన్న చోటును, వచ్చే మార్గంలో ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో బీబీఎంపీ కార్పొరేటర్ ఉదయ్కుమా ర్, పిళ్ళప్ప, కేఎస్ఆర్టీసీ అధ్యక్షుడు నాభి రాజు జైన్, బీఎంటీసీ ఉపాద్యక్షుడు వీఎస్.ఆరాధ్య, తదితరులు హాజరయ్యారు. -
ఎలక్ట్రిక్ బస్సు వచ్చిందోచ్...
సాక్షి, బెంగళూరు: దేశంలోనే తొలిసారిగా బెంగళూరు మహా నగర రోడ్డు రవాణా సంస్థ(బీఎంటీసీ) గురువారం ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశ పెట్టింది. మెజస్టిక్-కాడుగోడి మార్గంలో ప్రయోగాత్మకంగా ఈ బస్సును రోజుకు 6 ట్రిప్పుల చొప్పున 3 నెలల పాటు నడుపుతారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే వీటిని కొనుగోలు చేయాలని బీఎంటీసీ నిర్ణయించింది. ఆరు గంటల పాటు చార్జింగ్ చేస్తే ఈ బస్సు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పర్యావరణ నేస్తంగా పిలిచే ఈ బస్సులో 31 మంది కూర్చొని(నిల్చొనే వారు అదనం) ప్రయాణించవచ్చు. కాగా, బస్సు ధర రూ.2.70 కోట్లు. -
పల్లెకు పరుగులు
శివారు గ్రామాలకు బీఎంటీసీ బస్సులు ఫీడర్ సర్వీసులుగా గ్రామీణుల చెంతకు సాక్షి, బెంగళూరు : నగర శివారు గ్రామాల ప్రజలకు ఉత్తమ రవాణా సౌకర్యం కల్పించడానికి బీఎంటీసీ ఫీడర్ సర్వీసులను ప్రవేశ పెట్టింది. ‘సంపర్క సారిగె’ పేరిట ప్రారంభించిన ఈ సర్వీసులను ఆనేకల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు శివారు గ్రామాలకు బీఎంటీసీ బస్సుల సేవలు అందడం లేదన్నారు. దీని వల్ల ఆయా గ్రామాల వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం వారికి కూడా ‘మిడి’ రూపంలో బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. బెంగళూరు చుట్టుపక్కల 12 పారిశ్రామిక వాడలకు దగ్గరగా ఉన్న గ్రామాలకు మిడి బస్సులు సేవలు అందిస్తాయన్నారు. తొలుత చందాపుర, అత్తిబెలె పారిశ్రామిక వాడల పరిధిలోని 77 గ్రామాల ప్రజలకు ఈ సదుపాయాన్ని కలిగిస్తున్నామని తెలిపారు. అర గంటకో బస్సు చొప్పున మొత్తం ఏడు రూట్లలో 27 బస్సులను ప్రవేశ పెట్టామని వెల్లడించారు. ఈ సంఖ్యను 250కు పెంచుతామని చెప్పారు. మిగిలిన పారిశ్రామిక వాడలకు కూడా దశల వారీ ఫీడర్ సర్వీసులను విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే. సురేష్ పాల్గొన్నారు. ఈ సర్వీసుల ప్రత్యేకతలు = 30 సీట్లతో సాధారణ బస్సు కంటే పొడవు తక్కువ. దీని వల్ల గ్రామీణ రోడ్లలో సులభంగా తిరగడానికి వీలవుతుంది. = ఒక్కొక్క బస్సు ఖరీదు రూ.22 లక్షలు = ఏదైనా బస్సులో ‘గమ్య స్థానం టికెట్’ తీసుకుంటే, మధ్యలో ఎన్ని బస్సులైనా మారవచ్చు. టికెట్టు గడువు మూడున్నర గంటలు. = పారిశ్రామిక వాడల ప్రత్యేక సర్వీసులైన ‘బిగ్ట్రంక్’ బస్సుల్లో కూడా ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయి. రూట్లు చందాపుర హబ్ 3ఎఫ్-1 అనేకల్-దొమ్మసంద్ర, 3ఎఫ్-2 ఇడ్లవాడి సర్కిల్-ఆడిగొండనహళ్లి, 3ఎఫ్-3 జిగణి ఏపీసీ సర్కిల్-హందెనహళ్లి, 3ఎఫ్-4 శెట్టి హళ్లి-ఎపీఎంసీ మార్కెట్ (హుస్కూరు), అత్తిబెలె హబ్, 3ఎఫ్-5 అనేకల్-సర్జాపుర, 3ఎఫ్-6 దాసనపుర-సర్జాపుర, 4ఎఫ్-7 సమందూరు-నరసాపుర