ఎలక్ట్రిక్ బస్సు వచ్చిందోచ్... | electrical bus to run on the roads | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ బస్సు వచ్చిందోచ్...

Published Fri, Feb 28 2014 12:32 AM | Last Updated on Wed, Sep 5 2018 3:47 PM

ఎలక్ట్రిక్ బస్సు వచ్చిందోచ్... - Sakshi

ఎలక్ట్రిక్ బస్సు వచ్చిందోచ్...

సాక్షి, బెంగళూరు: దేశంలోనే తొలిసారిగా బెంగళూరు మహా నగర రోడ్డు రవాణా సంస్థ(బీఎంటీసీ) గురువారం ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశ పెట్టింది. మెజస్టిక్-కాడుగోడి మార్గంలో ప్రయోగాత్మకంగా ఈ బస్సును రోజుకు 6 ట్రిప్పుల చొప్పున 3 నెలల పాటు నడుపుతారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే వీటిని కొనుగోలు చేయాలని బీఎంటీసీ నిర్ణయించింది. ఆరు గంటల పాటు చార్జింగ్ చేస్తే ఈ బస్సు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పర్యావరణ నేస్తంగా పిలిచే ఈ బస్సులో 31 మంది కూర్చొని(నిల్చొనే వారు అదనం) ప్రయాణించవచ్చు. కాగా, బస్సు ధర రూ.2.70 కోట్లు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement