ఉస్మానాబాద్ నీటిని దారి మళ్లించిందెవరు? | Osmanabad water who returned | Sakshi
Sakshi News home page

ఉస్మానాబాద్ నీటిని దారి మళ్లించిందెవరు?

Published Sat, Aug 15 2015 4:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

ఉస్మానాబాద్ నీటిని దారి మళ్లించిందెవరు? - Sakshi

ఉస్మానాబాద్ నీటిని దారి మళ్లించిందెవరు?

పవార్‌పై సీఎం ఫడ్నవీస్ ఫైర్

 సాక్షి, ముంబై : ఉస్మానాబాద్ పర్యటనలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఉస్మానాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ డబ్బును ఎవరు తిన్నారని, జిల్లా టెక్స్‌టైల్స్ మిల్లు ఎవరి వల్ల మూతపడిందని, జిల్లాకు రావాల్సిన నీటిని ఎవరు దారి మళ్లించారని ప్రశ్నించారు. వీటన్నిటికీ ఎన్సీపీ సమాధాన మిచ్చిన తర్వాతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరాఠ్వాడాలో ధర్నా చేపట్టాలన్నారు.

మరాఠ్వాడలో కరవు పరిస్థితులు తలెత్తడానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎన్సీపీ కారణమని ఆరోపించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ కావాలనే గందగోళం ృసష్టించి కార్యకలాపాలు సాగకుండా చేయడం వల్ల అనేక బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయని విమర్శించారు. కరవు పీడిత ప్రాంతాల్లో బీజేపీ మంత్రులు పర్యటిస్తున్నారని, వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటున్నారని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement