టీవీలో సీరియల్స్ కాకుండా వార్తలు కూడా చూడాలి | Padmasali community Leader Call to womens | Sakshi
Sakshi News home page

టీవీలో సీరియల్స్ కాకుండా వార్తలు కూడా చూడాలి

Published Mon, Jan 19 2015 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

టీవీలో సీరియల్స్ కాకుండా వార్తలు కూడా చూడాలి

టీవీలో సీరియల్స్ కాకుండా వార్తలు కూడా చూడాలి

మహిళలకు పద్మశాలి సంఘం నేత పిలుపు
బోరివలి, న్యూస్‌లైన్: మహిళలు కేవలం టీవీలో వచ్చే సీరియల్స్‌ను కాకుండా వార్తలు కూడా విని కొంత పరిజ్ఞానం పెంచుకోవాలని ప్రాంతీయ పద్మశాలి సంఘం మహిళా శాఖ అధ్యక్షురాలు గుంటుక శైలజ పిలుపునిచ్చారు. బోరివలి పశ్చిమంలోని ప్రబోదన్ ఠాక్రే హాలులో శ్రీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పసుపు-కుంకుమ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి మహిళలో ఓ శక్తి దాగి ఉంటుందనీ, దాన్ని గుర్తించాలని చెప్పారు. పిల్లలను కూడా వార్తలు చూసేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంత రం వైద్య రంగంలో సేవలందిస్తున్న తెలుగు వారిని సన్మానించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులందచేశారు. కార్యక్రమం చివరిలో మహిళలకు పసుపు-కుంకుమలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం మహిళా శాఖ అధ్యక్షురాలు ఆడగట్ల అరుణ,  పద్మశాలి సంఘం అధ్యక్షులు చిల్క నారాయణ, ఉపాధ్యక్షులు పడిగె శివాజీ, ప్రధాన కార్యదర్శి చిల్క గోవర్దన్, ఉపకార్యదర్శి కట్టమహేందర్, కోశాధికారి దాస చంద్రకాంత్, సైవరాములు, ఆడగట్ల రవీంద్ర, కోడూరు అరుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement