బ్రేక్ ఫెయిలై భక్తురాలి పైనుంచి.. | Parked Bolero Vehicle rolls back on steep slope, kills chennai women in tirumala | Sakshi
Sakshi News home page

బ్రేక్ ఫెయిలై భక్తురాలి పైనుంచి..

Published Mon, Jul 11 2016 4:51 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

బ్రేక్ ఫెయిలై భక్తురాలి పైనుంచి.. - Sakshi

బ్రేక్ ఫెయిలై భక్తురాలి పైనుంచి..

తిరుమల: చెన్నై నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ భక్తురాలి పైనుంచి ప్రమాదవశాత్తూ బొలేరో వాహనం వెళ్లింది. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న పార్కింగ్‌లో ఉంచిన బొలేరో వాహనం గేర్, హ్యాండ్ బ్రేక్ ఫెయిలవ్వడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన గీత (47) కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. గో గర్భం డ్యాం వద్ద మౌనస్వామి మఠంలో బస చేశారు. శ్రీవారిని ద ర్శించుకుని తిరిగి గదికి చేరుకున్నారు.

తిరుగు ప్రయాణంలో గదిని ఖాళీ చేసి వెలుపల తమ వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఎత్తు ప్రాంతంలో పార్కింగ్‌లో ఉంచిన బొలెరో వాహనం వేగంగా దూసుకువచ్చింది. ఎదురుగా పార్కింగ్‌లో ఉంచిన టెంపో ట్రావెలర్‌ను ఢీకొని, తర్వాత రోడ్డు పక్కనే నిలబడిన గీతను ఢీకొట్టింది. ఆమె తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో అశ్విని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బొలేరో వాహనం మఠాల్లో దోబీ బట్టలు తీసుకెళ్లేందుకు వచ్చిందని, గేర్, బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తమతో ఆనందంగా గడిపిన గీత నిమిషాల వ్యవధిలో మృతిచెందడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement