మళ్లీ గ్రామానికి పోయిన కార్తీ
తొలి చిత్రం పరుత్తివీరన్‌లో కార్తీ పక్కా పల్లెవాసిగా జీవించారు. ఆ తరువాత ఆయన నగర నేపథ్య కథా చిత్రాలపై మొగ్గుచూపుతూ వచ్చారు. ఇటీవల విడుదలైన మెడ్రాస్ చిత్రంలో కూడా ఉత్తర చెన్నై యువకుడిగా ఆ పాత్రలో లీనమై నటించి ఆ చిత్రాన్ని విజయతీరాలకు చేర్చారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం కొంబన్. ఈ చిత్రం కోసం కార్తీ మరోసారి గ్రామీణ యువకుడిగా మారిపోయారు. కొంబన్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. చిత్ర వివరాలను హీరో కార్తీ తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేమిటో ఆయన మాటల్లోనే... కొంబన్ చిత్రకథను దర్శకుడు ముత్తయ్య పూర్తిగా నన్ను మనసులో పెట్టుకునే రాశారు.
కుట్టి పులి చిత్రం తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం కొంబన్. అమ్మ పెంపకంలో పెరిగిన అబ్బారుుకి మామ సంరక్షణలో పెరిగిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. ఆ కుటుంబం మధ్య ప్రేమానుబంధాలు ఉండవు. ఊరు విషయాలే చిత్ర కథ. గొర్రెల వ్యాపారి కొంబయ్య పాండియన్ అనే నాకు తల్లి ఎంత ముఖ్యమో నా ఊరు శ్రేయస్సు అంతేముఖ్యం. ఊరులో జరిగే విశేషాలకైనా పంచాయతీలకైనా ముందుడేది నేనే. ఊరికొక్కడు, ఊరి కోసం ఒక్కడు లాంటి కథ కొంభన్. ఇది మదురై, రామనాథపురం ప్రాంతాల మధ్య జరిగే కథ. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ జిల్లాల మధ్య సంస్కృతి, సంప్రదాయాల విషయంలో అంత వ్యత్యాసం ఉంటుందా? అని ఆశ్చర్యపోయాను.
ఎందుకంటే చెన్నైలో ఉండి చూస్తే దక్షిణ తమిళనాడు అంతా మదురై మాదిరే తెలుస్తుంది. కొంబన్ చిత్రంలో సులక్షణ పాత్ర పోషిస్తున్నాను. ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు చోటు చేసుకోవు. గ్రామం, కుటుంబం, అనుబంధాలు ఇవే చిత్రంలో కనిపిస్తాయి. కొంచెం పగ, ప్రతీకారాలు ఉంటాయి. ముఖ్యంగా మామ, అల్లుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం కొంబన్. హీరోయిన్‌గా లక్ష్మీమీనన్‌కు మినహా వేరెవరూ నటించినా ఈ చిత్రంలో పాత్ర అం తగా పండదు. అంతగా ఆమె ఆ పాత్రలో ఒదిగి పోయి నటిస్తున్నారు. మామగా రాజ్‌కిరణ్, అమ్మగా కోవై సరళ నటిస్తున్నార ని కార్తీ కొంబన్ వివరాలు వెల్లడించారు.