నోయిడా: ఆన్‌లైన్‌లో నీటి బిల్లుల చెల్లింపు ప్రక్రియ పనులను నోయిడా ప్రాధికార సంస్థ ప్రారంభిం చింది. ఈ సదుపాయం వచ్చే ఏడాది వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రస్తుతం కేవలం రెండు బ్యాంక్‌ల ద్వారానే నీటి బిల్లులు చెల్లిస్తున్నారు. దీనివల్ల వారు బిల్లింగ్ కౌంటర్ల వద్ద పొడవాటి క్యూలో నిలబడి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో నీటి బిల్లులు చెల్లించే విధానానికి శ్రీకారం చుట్టామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్ బిల్లుల విధానం సఫలీకృతమైన తర్వాతనే ఈ ప్రక్రియను మొదలెట్టామని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఆన్‌లైన్‌లో నీటి బిల్లుల చెల్లింపులో రాష్ట్రంలోని అగ్ర నగరాల్లో నోయిడా ఉందని వెల్లడైందని వివరించారు. అలాగే నీటి బిల్లుల చెల్లింపులో ఎదురవుతున్న సమస్యల గురించి నగరవాసులు ఇప్పటికే నోయిడా ప్రాధికార సంస్థకు అనేకసార్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. ‘ఆన్‌లైన్ విధానం వినియోగదారుల చెల్లింపులకు సులభంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు బిల్లుల రికార్డులు అప్‌డేట్ అవుతాయి. ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంద’ని ఆయన వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో నీటి బిల్లుల చెల్లింపులు
Published Tue, Nov 5 2013 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement
Advertisement