మందుపాతరను తొలగించిన పోలీసులు | police find out land mine in east godavari district | Sakshi
Sakshi News home page

మందుపాతరను తొలగించిన పోలీసులు

Published Fri, Dec 2 2016 10:53 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

police find out land mine in east godavari district

చింతూరు : తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దప్రమాదం తప్పినట్లైంది. చింతూరు మండలం సరివేల గ్రామ సమీపంలో జాతీయరహదారిపై మావోయిస్టులు గురువారం రాత్రి ఈ మందుపాతరను అమర్చి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టిన పోలీసులు మందుపాతరను గుర్తించి వెలికితీసి, నిర్వీర్యం చేశారు. అదేవిధంగా సంఘటన స్థలంలో పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఉన్న కరపత్రాలను తొలగించారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement