
మండ్య : ముఖ్యమంత్రి భద్రత పేరుతో స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన సంఘటన సోమవారం జిల్లాలోని నాగమంగళలో సోమవారం చోటు చేసుకుంది. ఈ దృశ్యాన్ని కొందరు మొబైల్ చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. సోమవారం నాగమంగల తాలూకాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సీఎం సిద్ధు హెలికాప్టర్‌లో వచ్చారు. సమావేశ ప్రాంతానికి వెళ్లేందుకు ఆయన ప్రత్యేక కారులో బయలుదేరారు.
ఈ సమయంలో రోడ్డుపై వాహనాలు సంచరించకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ మహిళను అంబులెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దాన్ని కూడా పోలీసులు నిలిపివేశారు. దీంతో సదరు మహిళను బంధువులు నడిపించుకుంటూ వెళ్లడం కనిపించింది. ఈ విషయం సోషల్ మీడియలో రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment