పాడేరు రూరల్(విశాఖపట్టణం): విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం సంగులోయ వద్ద ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో అనకాలపల్లి ఎక్సైజ్ పోలీసులు సంగులోయ గ్రామం వద్ద మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వ్యానులో తీసుకువస్తున్న 1,080 కిలోల గంజాయి పట్టుబడింది.
వ్యాన్ డ్రైవర్ కమ్ ఓనర్ పరారు కాగా అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌తోపాటు బైక్‌ను సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై లీలారాణి తెలిపారు. పట్టుబడిన వారు అన్నవరం, కొయ్యూరు ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు.
విశాఖలో 1,080 కిలోల గంజాయి స్వాధీనం
Published Fri, Dec 16 2016 12:37 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
Advertisement
Advertisement